Pages

Showing posts with label tips. Show all posts
Showing posts with label tips. Show all posts

18 July, 2011

తాజా... తాజా... బాత్...


                 రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే మిల్క్ బాత్ చేయండని బ్యూటీషన్లు అంటున్నారు. మిల్క్‌ బాత్‌లో చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు రోజంతా తాజాదనం అలాగే ఉంటుందని వారు సూచిస్తున్నారు.
                 ప్రతిరోజూ బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుంటే...,  అలాగే కాస్తంత కలబంద గుజ్జును బకెట్ నీటిలో వేసి స్నానం చేస్తే... ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటమే గాక, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి. 
                  ఇక అలసత్వం దూరం కావాలంటే.. గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది. శరీరాన్ని శుభ్రపరచడంతోపాటు మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇంకా కామొమైల్ ఆయిల్‌ను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడి చర్మంగల వారికి స్వాంతనివ్వడంతో పాటు అలసత్వం దూరమవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.

08 December, 2010

నొప్పులతో బాధపడే వారికి మసాజ్ తో ఉపశమనం.


ఎన్నో వ్యాధులు, దుర్ఘటనల వల్ల నొప్పులతో సతమతమవు తుంటారు. ఇలాంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మందులతో పాటు ఫిజియోథెరపీ అద్భుతంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.ఫిజియో థెరపీలో భాగంగా మసాజ్‌, రోల్ఫింగ్‌లాంటి పద్ధతులతోనూ, శరీరంలోని కీలక భాగాలను సున్నితంగా నొక్కడం ద్వారా రకరకాల విపరీతమై నొప్పులను బాగా తగ్గించ వచ్చని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. మెత్తని శరీరభాగాలపై స్వల్ప ఒత్తిడితో రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఇక రోల్ఫింగ్‌ ప్రక్రియలో కండరాల చుట్టూ ఉండే కణజాలంలో చేతులు, బొటనవేలు, వేలి కణుపులు, మో చేతులు ఉపయోగించి ఒత్తిడి కలగజేస్తారు. బాధితుల తల, మెడ, వెన్నెముకలను ఓ క్రమంలో ఉంచడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చని పరిశోధకులు వివరించారు.
              మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా కణతలు, కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.

నిత్య యవ్వనానికి బీట్రూట్, ముడతలు పోగొట్టే కోడిగుడ్డు సొన...


యవ్వనంగా కనపడేందుకు బీట్‌రూట్ రసం సేవిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, బీటా కెరోటిన్, పీచు పదార్థాలతోపాటు ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ ముదురు ఎరుపు రంగును సంతరించుకునేందుకు ప్రధాన కారణం ఇందులో ఆంధో సైనడిన్లుండటమేనని పరిశోధకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయాన్నే పరకడుపున బీట్‌రూట్ రసాన్ని సేవిస్తే శరీరానికి కావలసిన రక్త శాతాన్ని మరింతగా పెంచుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం రక్తకణాలపైనున్న అధిక కొవ్వును తొలగించి, మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. బీట్‌రూట్‌లో బిటైన్ అనే పోషకం అధికంగా ఉండటం మూలాన శరీరంలో నిల్వవున్న చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. దీంతో నిత్యం యవ్వనులుగా ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. 
                  శరీరంలోని వివిధ భాగాలలోను, ముఖంపై ముడతలు పడకుండా ఉండేందుకు కోడిగ్రుడ్డును ఉపయోగించండి. గ్రుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కళ్ళకు తగలకుండా ముఖానికి పూయండి. అలాగే గొంతు, బాహు మూలాల వద్ద కూడా పూయండి. ఇలా పదినిమిషాలుంచిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తెల్లసొన చర్మంపైనున్న రంద్రాలను పటిష్టవంతం చేస్తుంది. దీంతో వదులుగా మారే చర్మం కాస్త గట్టిపడుతుంది. దీంతో ముడతలు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

26 November, 2010

మోకాళ్ళ నొప్పులకు జోళ్ళు లేకుండా...


మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు జోళ్ళు(చెప్పులు) లేకుండా నడిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి జోళ్ళు లేకుండా నడిచేలా ఇటీవల తాము పరిశోధనలు నిర్వహించామని పరిశోధకులు తెలిపారు. జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కొందరు ట్రైనర్ మేజోళ్ళు ధరించి నడుస్తుంటారు. దీంతో అందులోనున్న ప్యాడ్ మోకాళ్ళు, పాదాలు, అరికాళ్ళపై తీవ్రమైన ప్రభావం పడుతుండటం తాము గమనించామని, దీంతో మోకాళ్ళ నొప్పులు లేని వారికి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో జోళ్ళు లేకుండా నడిస్తే కాళ్ళకు మంచి వ్యాయామంతోపాటు బలం కూడా చేరుకూరుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు.  
నడక, జాగింగ్ చేసేటప్పుడు జోళ్ళు ధరించకుండానే నిత్యం వ్యాయామం చేస్తే చాలా సౌకర్యవంతంగాను, మోకాళ్ళ నొప్పులు రాకుండాను ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

11 November, 2010

ఓవర్ టైం చేస్తున్నారా...అయితే !!


ప్రస్తుతం చాలామంది ఓవర్ టైం జాబ్ చేసి ఎక్కువ సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటుంటారు. అధిక సమయం పనిచేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు చాలామంది. కార్యాలయాల్లో సాధారణ పనివేళల్లో పనులు పూర్తి చేసి మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగానే ఉంటారు.

కాని ప్రపంచంలోని దాదాపు 60 శాతంమంది ప్రజలు అదనపు పని వేళల్లో పనిచేసి గుండె సంబంధిత జబ్బులను కొని తెచ్చుకుంటున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని యూనివర్శిటీ కాలేజ్ లండన్, ఫిన్నిష్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థలకు చెందిన పరిశోధకులకు నాయకత్వం వహించిన మరియన్నా విర్తానేన్ తెలిపారు.

తాము గత 11 సంవత్సరాలపాటు తాము 6,014 మందిని పరిశోధించినట్లు ఆమె తెలిపారు. తాము పరిశోధనలు ప్రారంభించిన సమయంలో (1990) వారి గుండెలు ఆరోగ్యంగానే ఉన్నాయి. పదకొండు సంవత్సారలపాటు పరిశోధించిన తర్వాత వీరిలో 369 మంది గుండె సంబంధిత జబ్బులతో మృతి చెందారు. మృతి చెందినవారు అధిక పనిభారాన్ని తట్టుకోలేక, మానసికపరమైన ఒత్తిడి కారణంగా గుండె జబ్బులతో మృతి చెందినట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆమె వివరించారు.

పనివేళల్లో పనిచేసి అదనంగా మరో నాలుగు గంటలపాటు ఓవర్ టైం పని చేసిన వారిలో అధిక బరువు, కొవ్వు శాతం పెరిగిపోయిందని, పైగా గుండె సంబంధిత జబ్బులున్నట్లు తాము కనుగొన్నామని ఆమె తెలిపారు. అదే ఓవర్ టైం పని చేయనివారిలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆమె చెప్పారు.
    
తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు ఓవర్ టైం చేయకుండా ఉండటమే ఎంతో మంచిదని ఆమె సూచించారు. ఇదిలావుంటే... ఓవర్ టైం చేయడం వలన మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి తదితర జబ్బులు ప్రాథమిక దశలో తలెత్తుతాయి. దీంతో శరీరం సహకరించకపోవడం జరుగుతుంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే అనారోగ్యంబారిన పడక తప్పదంటున్నారు పరిశోధకులు.

31 October, 2010

లేత గులాబీల్లాంటి పెదాల కోసం ఎం చేయాలంటే!!


మీ పెదాలు గరుకుగా ఉండి చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటే వాటిపై కాసింత శ్రద్ధ చూపండి. మీ పెదాలు గులాబీ రేకుల్లా సుతిమెత్తగా ఉండాలంటే రోజుకు మూడు లేదా నాలుగుసార్లు పగిలిన పెదాలపై తేనె పూయండి. ఇలా నాలుగు-ఐదు రోజులపాటు చేస్తే పెదాలు గులాబీ రేకుల్లా సుతిమెత్తగా తయారవుతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

కొందిరికి పెదాలపై పొక్కులు లేస్తుంటాయి. దీంతో గరుకుగా తయారవుతాయి. పొక్కులనుంచి ఉపశమనం పొందాలంటే మరో చిట్కా మీ కోసం. గోరింటాకు (మెహందీ) వేర్లు, బాదం నూనె 60 మిల్లీ గ్రాములు, 15గ్రాముల మైనం(వ్యాక్స్)ను తీసుకోండి.

గోరింటాకు వేర్లను బాగా దంచుకోండి. దంచుకున్న వేర్లను బాదం నూనెలో పది రోజుల వరకు నానబెట్టండి. పది రోజుల తర్వాత నూనెను వడగట్టండి. మైనంను వేడి నీటిపైవుంచి కరగబెట్టుకోండి. ఈ మూడింటిని మిశ్రమంలా కలుపుకుని మీ పెదాలకు పూయండి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులపాటు చేస్తే పెదాలు గులాబీరేకుల్లో సుతిమెత్తగా తయారవుతాయి.

28 October, 2010

మేకప్ చెదరకుండా ఉండేందుకు "క్యారెట్" వాడండి & వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోండి.

మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటలతరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.
 
వేసవి కాలంలో లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే కేవలం కాటన్ దుస్తులనే ధరించండి. వానా కాలంలో సింథటిక్, చలికాలంలో సిల్క్ వస్త్రాలను ధరిస్తే శరీరానికి అలసట అనేది తెలియదు. కాలానికి తగ్గట్టు బట్టలను ధరిస్తే చాలా మంచిది. 


మేకప్ చేసుకునే అలవాటుంటే లేదా ఏదైనా ఫంక్షన్, కార్యక్రమాలకు అటెండ్ అయ్యేలా ఉంటే ప్రత్యేకంగా పగటిపూట తేలికపాటి మేకప్ వేసుకోండి. ముఖ్యంగా వేసవి, వర్షా కాలాల్లో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోండి. ఇలా చేస్తే మీరు మేకప్ వేసుకున్నట్లే కనపడదంటున్నారు బ్యుటీషియన్లు.


లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మరియు ఐ షేడ్‌లు మేకప్‌ను ప్రధానంగా ఆకర్షించేటివి. వీటిని మీరు ఉపయోగించే నేపథ్యంలో మీ వయసు, పరిసరాలను దృష్టిలో ఉంచుకుని వాడండి.   

సాధారణమైన పార్టీలకు మీరు అటెండ్ అయ్యేటప్పుడు మేకప్ అదిరిపోయేలా ఉండకూడదు. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ధరించే దుస్తులుకూడా సాధారణంగానే ఉండేలా ధరించండి. మీరు వేసుకునే మేకప్ మిమ్మల్ని ఉన్నతంగా చూపేలా వేసుకోండి. 

కొందరికి మేకప్ వేసుకుంటే అది త్వరగా పాడైపోయి ముఖం అందవికారంగా మారిపోతుంటుంది. కొన్ని సందర్భాలలో కొందరు వాడే మేకప్ చాలాసేపటి వరకు ఉండదు. ఇలాంటివారు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం చాలా ఉత్తమం.

దూదిని నీటిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేయండి. దీనికి క్లీజింగ్ మిల్క్ ఉపయోగించండి. ముక్కు, గడ్డం, నుదురును శుభ్రపరచండి. ఎందుకంటే ముఖంపై ఎక్కువగా నూనె పదార్థాలుంటాయి.

మేకప్ వాడే అలవాటున్నవారు ప్యాన్ స్టిక్ లేదా ప్యాన్ కేక్ మేకప్‌ను ప్రయోగించండి. ఇది ఆయిల్ బేస్డ్ అయితే ముఖంపై తేలికపాటి మెరుపు కలిగి ఉంటుంది. దీని తర్వాత స్పాంజ్‌ను నీటిలో ముంచి ముఖంపై రుద్దండి.

దీంతో మీరు వేసుకున్న మేకప్ వాటర్‌ప్రూఫ్‌లా మారిపోతుంది. మీరు వాడిన మేకప్‌పై నీటిలో ముంచిన దూదితో రుద్దకపోతే మేకప్ ఎండిపోతుంది. పైగా పగుళ్ళు కనపడుతాయి. తర్వాత బ్రష్‌తో కాంపాక్ట్‌ను పూయండి.

ఇలా చేస్తే ముఖంపైనున్న ముడుతలుకూడా కనపడవంటున్నారు బ్యుటీషియన్లు. వర్షాకాలంలో లైట్ మరియు మైట్ ఫినిష్‌లాంటి మేకప్ వేసుకోండి. గ్లాసీ మేకప్ చెమట లేదా వర్షం కారణంగా వెంటనే పాడైపోతుంది.


26 October, 2010

ముఖంపై ముడతలా..? అయితే...


సాధారణంగా యువతుల్లో ముఫ్పై ఏళ్లు దాటగానే.. ముఖంపై ముడతలు వచ్చేస్తుంటాయి. దీంతో వారు తెగ బాధ పడిపోతుంటారు. వీటి నుంచి తప్పించుకునేందుకు రకరకాల క్రీములు రాయడం, బ్యూటీ పార్లర్‌కు వెళ్లి పర్సులు ఖాళీ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ.. బ్రిటీష్ వైద్యులు మాత్రం ఇలాంటివేవీ అవసరం లేకుండా మంచి నీటితో ముఖంపై ముడతలకు స్వస్తి చెప్పవచ్చని భరోసా ఇస్తున్నారు.

రోజుకు కనీసం ఒకటిన్నర లీటర్ (8 గ్లాసుల) మంచినీటిని తాగితే ముఖంపై ముడతలు నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వల్ల శరీరంలో మలినాలు బయటకు వెళ్లి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందని వారి తాజా పరిశోధనలో వెల్లడైంది.

ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది స్త్రీలకు వారి ఆహారపు అలవాట్లు, దినచర్యలలో ఎలాంటి మార్పులు లేకుండా.. యధాతథంగా కొనసాగిస్తూనే రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఎనిమిది వారాల పాటు తీసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. వీరిలో కొందరు సాధారణ ట్యాప్ వాటర్ సేవించగా మరికొందరు బ్రిటన్‌లోని ఓ సరస్సులో దొరికే సహజసిద్ధమైన మినరల్ వాటర్‌ను సేవించారు.

అనంతరం వీరి ఫోటోలను ఎనిమిది వారాలకు ముందు ఎనిమిది వారాలకు తర్వాత తీసి తేడా పోల్చి చూశారు. అశ్చర్యంగా ట్యాప్ వాటర్ సేవించిన వారి ముఖంపై 19 శాతం చర్మం ముడతలు తగ్గగా.. మినరల్ వాటర్ సేవించిన వారి ముఖంపై 24 శాతం మేర చర్మం ముడతలు తగ్గినట్లు వారు గుర్తించారు.


21 October, 2010

హైహీల్స్ వేసుకున్నంత మాత్రాన అబ్బాయిలు ఫ్లాటవ్వరు..!!, హై హీల్స్ అనారోగ్యాన్నీ తెస్తాయ్


కొంతమంది స్త్రీలు తమకు ఇబ్బందిగా ఉన్నప్పటీ పురుషుల దృష్టిని ఆకర్షించడానికి ఎత్తు మడమ చెప్పులు (హై హీల్స్) ధరిస్తుంటారు. అయితే ఇలాంటివి ధరించి తమ ఆరోగ్యం, సమయం వృధా చేసుకోవద్దని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే వీటిని పురుషులు అస్సలు గుర్తించరట..!

ఉత్తర ఆంబ్రియా కళాశాల నిపుణులు జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. అబ్బాయిలు కనీసం అమ్మాయిలను హైహీల్స్ వేసుకోమని కూడా చెప్పరని, కొందరు స్త్రీ, పురుషులపై జరిపిన పరిశోధనలో వారు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా హైహీల్స్ ధరించే యువతులు, హైహీల్స్ ధరించని యువతులపై పురుషుల స్పందనను వారు పరిశీలించారు.


స్త్రీలు ధరించే హీల్స్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేదని వారు గుర్తించారు. "స్త్రీలు అందంగా కనబడటం కోసం అనవసరంగా హైహీల్స్‌పై డబ్బు ఖర్చు చేస్తారు, అది వారి ఆరోగ్యానికే ప్రమాదం.. సహజంగానే వారు అందంగా ఉంటారనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. మానవులకు సంబంధాలు చాలా ముఖ్యం" అని డే నీవే అన్నారు.

"హై హీల్స్" ఇంకో మాటలో చెప్పాలంటే మునివేళ్ళ మీద నడవటం. ఇది చూడడానికి బానే వుంటుంది కానీ... ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలానే ఉంటాయి. మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్(ఎముకుల డాక్టర్)లు అంటున్నారు.

మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తద్వారా కండరాల కదలిక భారమై మోకాలి జాయింట్లు అరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


మీకు హీల్స్ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే డాక్టరును సంప్రదించి ఎంత ఎత్తు వరకూ హీల్ వాడవచ్చనే విషయాన్ని దృవీకరించుకొని మరీ వాడితే మంచిది.

20 October, 2010

మసాలా దినుసుల్లో దాగున్న ఆరోగ్య రహస్యం!!

ప్రకృతి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా వరదాయినిగా మారిందనడంలో సందేహం లేదు. దీనికి రకరకాల వనమూలికలు, ఇతర మసాలా దినుసులను అందించింది. మసాలా దినుసులు, వనమూలికలు మనిషి ఆరోగ్యానికి ప్రథమ చికిత్సలా తోడ్పడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
* పసుపు : పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగివుంది. అలాగే స్త్రీలు ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు. ఇందులో బేసిన్ పొడి కలుపుకుని ముఖానికి దట్టిస్తే ముఖారవిందం మరింతగా ఇనుమడింపజేస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
* అల్లం : అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తు ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.
* మెంతులు : మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళతో కలిపి తీసుకుంటే మొకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులోవుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.

* జిలకర : జిలకర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం. అజీర్తిలాంటి వాటితో సతమతమౌతుంటే జిలకర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
* సోంపు : సోంపు శరీరానికి చలవచేస్తుంది. ప్రతి రోజు భోజనానంతరం చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
* ఉసిరికాయ : ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులోవుంటుంది. ఎండిపోయిన కాయలోను విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయను ప్రతి రోజు తీసుకోవడం వలన వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతాయి. వీలైతే ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* తులసి : తులసిలో శరీరాన్ని చల్లబరిచే గుణంవుంది. వాయు సంబంధిత జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది.
* ధనియాలు : ధనియాలు కళ్ళ కాంతిని పెంచుతుంది. 


18 October, 2010

షాపింగ్ మాల్స్ లో డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్స్ లో రహస్య కెమెరా లు ఉంటాయా...!!!


పలు దుకాణాల్లో అత్యంత రహస్యమైన కెమెరాలను అమర్చినట్లు సమాచారం. అలాగే కాల్ సెంటర్లలోని విశ్రాంతి గదులు, పలు కార్యాలయాల్లో మహిళలు విశ్రాంతి తీసుకునే గదుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసివుంచినట్లు వారు తెలిపారు. దీంతో మహిళలకు స్వేచ్ఛ అనేది లేకుండా పోతోందని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేసాయి. 



* మీరు పనిచేసే కార్యాలయంలో ప్రత్యేకంగా మహిళలకు విశ్రాంతి గది ఉంటే అక్కడ రహస్య కెమెరాలుండవచ్చు. 

* మీరు షాపింగ్ చేసే సమయంలో షాపింగ్ మాల్స్, షో రూంలు, వస్త్ర దుకాణాల్లో దుస్తులు మార్చుకునే సౌకర్యం ఉండే గదుల్లో అద్దాల వెనుక రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారేమోనని ఓ సారి పరికించి చూడండి.



* రెస్టారెంట్ లేదా హోటల్‌లో చేతులు వాష్ బేసిన్ వద్ద, మహిళల మరుగుదొడ్లలో కంటికి కనపడకుండా ఉండేలా రహస్య కెమెరాలుండవచ్చు. 


* ప్రత్యేకంగా మహిళల కోసమే గదులు కేటాయించిన సమయంలో అక్కడ ఇలాంటి రహస్య కెమెరాలుండే అవకాశాలుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని మాత్రం మీరు షాపింగ్ చేయకుండా ఉండలేరు కదా!! ఇలాంటి సంఘటనలను తేలికగాను తీసుకోలేము, కాని ఏదో ఒకటి చేయాలి, చేయక తప్పదు మరి. 




మహిళలు షాపింగ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలుః


* మీరు షాపింగ్ చేసే సందర్భంలో దుస్తులు మార్చుకునే గదికి వెళితే... దుస్తులు మార్చుకునే ముందు అక్కడి తలుపులు, గోడలు, అద్దం తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా రహస్య కెమెరాలున్నాయేమో చూసుకోండి. మీకు సంబంధించని వస్తువు ఏదైనా ఉంటే జాగ్రత్తగా వ్యవహరించండి.

* మీరు డ్రెస్ ఛేంజింగ్ రూం లేదా విశ్రాంతి గదిని ఉపయోగించేలాగుంటే... ముందుగా ఆ గదిని పరికించి చూడండి. తలుపులు, గోడల్లో ఎక్కడైనా గ్యాప్ ఉందేమో చూసుకోండి. లేదా కొత్తగా ఏదైనా వస్తువుంటే ఆ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించండి.

* దుస్తులు మార్చుకునే గది చిన్నదిగా ఉంటే మీరు గదిలోకి వెళ్ళగానే లైట్లను ఆర్పేయండి. దుస్తులు మార్చుకున్న తర్వాత మళ్ళీ లైట్లు వేసుకోండి. కాని చీకట్లోను రికార్డు చేసే కెమెరాలుంటాయి. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.

* డ్రెస్సింగ్ రూం లేదా రెస్ట్ రూంలో గోడలు, అద్దం వద్ద ఏదైనా నల్లటి చుక్క లేదా చిన్న లైటుంటే మీరు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.


డ్రెస్సింగ్ రూంలోనున్న అద్దాన్ని పరీక్షించండిలాః

అద్దం వెనుక రహస్య కెమెరా ఉందేమో చూసుకోండి. అద్దం సాధారణంగానే కనపడుతుంది. కాని మరోవైపు మిమ్మల్ని పసిగడుతుంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... మీ చేతి వేలి కొనను అద్దంపై ఉంచండి. మీ వేలి నీడ అద్దంపై కాసింత తేడాతో పడితే లేదా అద్దంపై ఏ మాత్రం గ్యాప్ ఉంటే అది మంచి అద్దంగానే భావించవచ్చు. దీంతో మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. కాని మీ వేలికి అద్దానికి మధ్యలో దూరం లేకపోతే జాగ్రత్త వహించండి. ఆ అద్దం వెనుక రహస్య కెమెరా ఉండొచ్చు.


16 October, 2010

పదహారేళ్లకే జుట్టు తెల్లబడిపోతుంటే...?

చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్. ఇకపై మరిన్ని వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉసిరి ఇందుకు బాగా ఉపకరిస్తుంది.

ప్రతిరోజూ ఓ ఉసిరికాయ రసం తాగండి.


హెన్నా పొడిలో కూడా ఉసిరిపొడిని కలుపుకోవాలి. అయితే హెన్నా తెల్లజుట్టును రెడ్డిష్ బ్రౌన్‌గా మార్చుతుంది. రెండు మూడు కప్పుల నీటిలో గుప్పెడు ఎండు ఉసిరికాయలు నానబెట్టి మరునాటి ఉదయం వడకట్టి, కాయల గుజ్జు రుబ్బి హెన్నా పొడిలో కలుపుకోవాలి.

నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి టీ స్పూన్లు, పచ్చి గుడ్డుసొన, రెండు టీస్పూన్ల నూనె, వడగట్టిన ఉసిరి రసం కలిపి చక్కని పేస్ట్ తయారు చేసి రెండు మూడు గంటలు అలాగే నాననిచ్చి జుట్టుకు అప్లయ్ చేయాలి. కనీసం రెండు గంటలసేపుంచి కడిగేయాలి.

Trend N track

Trend N track
YouTube Channel