Pages

03 March, 2011

బాబ్రీ విధ్వంస వేళ... పి.వి. మౌన మేల...?

                       పి.వి. నరసింహ రావు ఒక మర్మ యోగి, అపర చాణక్యుడు. దేవుడు గూర్చి మనుషులు తన్నుకోవడం ఒక పనికిమాలిన విషయం. సర్వాంతర్యామి కి ఫలానా ప్రదేశం లోని ఒక స్థానం పై ప్రత్యేక మమకారం అంటూ ఏమి ఉండదు. ముస్లిములు, హిందువులు మధ్య రాజకీయ లబ్ది కోసం చిచ్చు పెట్టే వారికి అవకాశం ఇవ్వరాదని, అసలు అక్కడ మసీదు కూడా లేకుంటే ఏ గొడవా ఉండదని పి.వి. తలంచారేమో. మారటోరియం పేరుతో పలు పనికిమాలిన సమస్యలను పక్కనబెట్టి, మన్మోహన్ ను ఆర్ధికమంత్రిని చేసి దేశాన్ని అభివృద్ది బాట పట్టించి, తరువాత అధికారం లోనికి వచ్చిన BJP కు కూడా మతం బాట వదిలి, అభివృద్ది బాట పట్టే పరిస్థితులు కల్పించారు. బాబ్రీ మసీదు విషయమై నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ను బట్టి, తీర్పు తరువాత కూడా దేశం  ప్రశాంతం గా ఉండడం చూసాక ఆనాడు పి.వి. యొక్క మౌనం వెనుక రహస్యం అవగతమైంది. BJP కేంద్రం లో అధికారం చేపట్టిన వెంటనే, ఆర్ధిక సంస్కరణలు బాట వీడకుండా ఉండే విషయమై BJP కు మార్గదర్శనం ఇవ్వడం కోసం, పి.వి. సూచనల మేరకు మన్మోహన్ BJP నాయకుల వద్దకు వెళ్ళి సూచనలు ఇచ్చారు, వారు కూడా మన్మోహన్ సలహాలను గౌరవించారు.
                       ఇక పి.వి. దహన సంస్కారం కార్యక్రమం విషయానికి వస్తే, అది సోనియా సంకుచిత మనస్తత్వం ను సూచిస్తుంది.  ఉత్తరభారతదేశం లోని ఒక మతం వారు, ఎవరైనా చనిపోతే వారి మృతదేహానికి దహన సంస్కారం అంటూ చేయకుండా ఆ దేహాన్ని ఒక కొండ మీద గద్దలకు, రాబందులకు ఆహరం గా విసిరేస్తారు. కాబట్టి ఇక్కడ మృతదేహానికి లభించిన గౌరవం అనేది ముఖ్యం కాదు. వారు ఎలా చచ్చారన్నది చూడాలి. యుద్ధ భూమి లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల ఆచూకి కూడా లభించి ఉండకపోవచ్చు. కానీ వారు అమరవీరులయ్యారు. అలాగే పి.వి. ...
                ఇక్కడ హేళన చేయాల్సింది పి.వి. మరణాన్ని కాదు, సోనియా సంకుచిత మనస్తత్వాన్ని. 

5 comments:

  1. "ఇక్కడ హేళన చేయాల్సింది పి.వి. మరణాన్ని కాదు, సోనియా సంకుచిత మనస్తత్వాన్ని"

    It is sad that Indians did not realize the true nature of Sonia. Experts say that she is a spy for the West, who is here to destroy Indian (read Hindu) culture.

    ReplyDelete
  2. I am not sure about his vision about Babri but he was indirectly responsible for the current development that is going on in the country.

    ReplyDelete
  3. @అక్కడ మసీదు కూడా లేకుంటే ఏ గొడవా ఉండదని పి.వి. తలంచారేమో.

    idi nijam ayite, jarigina allakallolam, praana nashtam?

    ReplyDelete
  4. ilaanti vishayaalalo kontha nashtam thappadu bharinchaalsinde..., lekapothe ee rojukee aa godava raavana kaashtam laa raguluthoone untundi. ippatikee allarlu jaruguthoone..., praananashtam jaruguthoone untundi. aa vishayam koodaa theleeni amaayakudu kaadu P.V....

    ReplyDelete
  5. $రంగా గారు
    మరో కోణంలో చక్కగా చెప్పారు ఆపరచాణక్యుల వారి గురించి. ధన్యవాదాలు.

    ReplyDelete

Trend N track

Trend N track
YouTube Channel