రోజుకు కనీసం ఒకటిన్నర లీటర్ (8 గ్లాసుల) మంచినీటిని తాగితే ముఖంపై ముడతలు నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వల్ల శరీరంలో మలినాలు బయటకు వెళ్లి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందని వారి తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది స్త్రీలకు వారి ఆహారపు అలవాట్లు, దినచర్యలలో ఎలాంటి మార్పులు లేకుండా.. యధాతథంగా కొనసాగిస్తూనే రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఎనిమిది వారాల పాటు తీసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. వీరిలో కొందరు సాధారణ ట్యాప్ వాటర్ సేవించగా మరికొందరు బ్రిటన్‌లోని ఓ సరస్సులో దొరికే సహజసిద్ధమైన మినరల్ వాటర్‌ను సేవించారు.
అనంతరం వీరి ఫోటోలను ఎనిమిది వారాలకు ముందు ఎనిమిది వారాలకు తర్వాత తీసి తేడా పోల్చి చూశారు. అశ్చర్యంగా ట్యాప్ వాటర్ సేవించిన వారి ముఖంపై 19 శాతం చర్మం ముడతలు తగ్గగా.. మినరల్ వాటర్ సేవించిన వారి ముఖంపై 24 శాతం మేర చర్మం ముడతలు తగ్గినట్లు వారు గుర్తించారు.
No comments:
Post a Comment