Pages

28 October, 2010

మేకప్ చెదరకుండా ఉండేందుకు "క్యారెట్" వాడండి & వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోండి.

మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటలతరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది.
 
వేసవి కాలంలో లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే కేవలం కాటన్ దుస్తులనే ధరించండి. వానా కాలంలో సింథటిక్, చలికాలంలో సిల్క్ వస్త్రాలను ధరిస్తే శరీరానికి అలసట అనేది తెలియదు. కాలానికి తగ్గట్టు బట్టలను ధరిస్తే చాలా మంచిది. 


మేకప్ చేసుకునే అలవాటుంటే లేదా ఏదైనా ఫంక్షన్, కార్యక్రమాలకు అటెండ్ అయ్యేలా ఉంటే ప్రత్యేకంగా పగటిపూట తేలికపాటి మేకప్ వేసుకోండి. ముఖ్యంగా వేసవి, వర్షా కాలాల్లో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోండి. ఇలా చేస్తే మీరు మేకప్ వేసుకున్నట్లే కనపడదంటున్నారు బ్యుటీషియన్లు.


లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మరియు ఐ షేడ్‌లు మేకప్‌ను ప్రధానంగా ఆకర్షించేటివి. వీటిని మీరు ఉపయోగించే నేపథ్యంలో మీ వయసు, పరిసరాలను దృష్టిలో ఉంచుకుని వాడండి.   

సాధారణమైన పార్టీలకు మీరు అటెండ్ అయ్యేటప్పుడు మేకప్ అదిరిపోయేలా ఉండకూడదు. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ధరించే దుస్తులుకూడా సాధారణంగానే ఉండేలా ధరించండి. మీరు వేసుకునే మేకప్ మిమ్మల్ని ఉన్నతంగా చూపేలా వేసుకోండి. 

కొందరికి మేకప్ వేసుకుంటే అది త్వరగా పాడైపోయి ముఖం అందవికారంగా మారిపోతుంటుంది. కొన్ని సందర్భాలలో కొందరు వాడే మేకప్ చాలాసేపటి వరకు ఉండదు. ఇలాంటివారు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం చాలా ఉత్తమం.

దూదిని నీటిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేయండి. దీనికి క్లీజింగ్ మిల్క్ ఉపయోగించండి. ముక్కు, గడ్డం, నుదురును శుభ్రపరచండి. ఎందుకంటే ముఖంపై ఎక్కువగా నూనె పదార్థాలుంటాయి.

మేకప్ వాడే అలవాటున్నవారు ప్యాన్ స్టిక్ లేదా ప్యాన్ కేక్ మేకప్‌ను ప్రయోగించండి. ఇది ఆయిల్ బేస్డ్ అయితే ముఖంపై తేలికపాటి మెరుపు కలిగి ఉంటుంది. దీని తర్వాత స్పాంజ్‌ను నీటిలో ముంచి ముఖంపై రుద్దండి.

దీంతో మీరు వేసుకున్న మేకప్ వాటర్‌ప్రూఫ్‌లా మారిపోతుంది. మీరు వాడిన మేకప్‌పై నీటిలో ముంచిన దూదితో రుద్దకపోతే మేకప్ ఎండిపోతుంది. పైగా పగుళ్ళు కనపడుతాయి. తర్వాత బ్రష్‌తో కాంపాక్ట్‌ను పూయండి.

ఇలా చేస్తే ముఖంపైనున్న ముడుతలుకూడా కనపడవంటున్నారు బ్యుటీషియన్లు. వర్షాకాలంలో లైట్ మరియు మైట్ ఫినిష్‌లాంటి మేకప్ వేసుకోండి. గ్లాసీ మేకప్ చెమట లేదా వర్షం కారణంగా వెంటనే పాడైపోతుంది.


No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel