Pages

28 July, 2012

నవరంగ్ సమోసా@విజయవాడ ... కనెక్ట్ చేస్తుంది నన్ను విజయవాడ తో...


1990 లలో విజయవాడ లో చదువు వెలగబెట్టిన తరువాత విజయవాడ ను వీడాక, మధ్యమధ్యలో విజయవాడ విజిట్ చేసినపుడు, తిరిగి ఇంటికి  వచ్చాక మొదట్లో ఏదో అనీజీగా ఉండేది. అన్నేళ్ళు విజయవాడ లో ఉన్నాం కదా, సరిగా కనెక్ట్ కాలేక పోతున్నానేమిటి ఇపుడు విజయవాడ తో అని అనుకునేవాడిని. ఆలోచిస్తే ఒక విషయం తట్టింది.   ఇక మరోసారి విజయవాడ వెళ్ళినపుడు నవరంగ్ సమోసా తిన్నా..., అంతే... విజయవాడ తో కనెక్ట్ అయిపోయా. అంతే అప్పటినుండి విజయవాడ వెళ్ళిన ప్రతిసారీ నవరంగ్ సమోసా రుచి చూడ్డం, వీలైతే ఇంటికి పార్సిల్ తీసుకు వెళ్ళడం చేస్తున్నా. ఎందుకంటే..., ఆ చదువుకునే రోజుల్లో నవరంగ్ సమోసా తినడం నా దినచర్య లో భాగమైపోయింది మరి. ఒకోసారి... టిఫిన్ కు బదులు, భోజనానికి బదులు నవరంగ్ సమోసాలు తిని నవరంగ్ చాయ్ తాగి కడుపు నింపుకునేవాడిని. అంత ఇష్టం మరి. నవరంగ్ చాయ్ కూడా చిక్కగా, స్ట్రాంగ్ గా ఉండేది. నవరంగ్ సమోసా లో పుదీనా ఫ్లేవర్ కలిగి స్వీట్ బ్రెడ్ తో చేసిన హాట్ కర్రీ ఉంటుంది. అలాగే..., నవరంగ్ ధియేటర్ కూడా..., విజయవాడ లో ఎన్ని పెద్ద ధియేటర్లు ఉన్నా,  చూడ్డానికి పాతకాలం మేడ లా ఉన్నా..., నవరంగ్ థియేటర్ లో సినిమా చూసే అనుభూతే వేరు. కొత్త హాలివుడ్ మూవీసే గాక మా ముందు తరం సినిమాలైన క్లింట్ ఈస్ట్ వుడ్ కౌబాయ్, జేమ్స్ బాండ్, చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ అక్కడే చూసాం. అప్పట్లో కేబుల్ టీవీ లేదు, మిగతా ధియేటర్ వాళ్ళు ఇలా పాత క్లాసిక్స్ వేసేవాళ్ళు కాదు. అలా..., నవరంగ్ ధియేటర్ ప్రత్యేకమైన అభిరుచి, ముద్ర కలిగి ఉండేది. నే మొదటసారి నవరంగ్ సమోసా రుచి చూసింది ఈ నవరంగ్ ధియేటర్ లోనే. అప్పటిదాకా నాకు సమోసా పై చిన్న చూపు ఉండేది, కూలీనాలీ తినేదని. దానికి తగ్గట్టు వాటి రుచి కూడా అలానే ఏడ్చేది..., మిగతా ఊళ్లలో. సినిమా కు వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ లో ఈ సమోసాలపై ఎగబడ్డం చూసి ఆశ్చర్యమేసింది నాకు. సరే..., ఏమిటో చూద్దాం దీని రుచి... అని అపుడు తిన్నా ఈ నవరంగ్ సమోసా. అది మొదలు ఇక.... సరే..., ఇదండీ..., విజయవాడ తో నా నవ'రంగా'నుబంధం.

8 comments:

  1. really they are very tasty

    ReplyDelete
  2. ఇలాంటి సమోసాలు విజయవాడలో ఊర్వశి కాంప్లెక్సులో, ఇంకా చాలాచోట్ల దొరుకుతాయి. కానీ నవరంగ్ లో టీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ థియేటర్ మూతబడ్డా టీ స్టాల్ కొనసాగింది. దానికోసం అక్కడిదాకా వెళ్ళేవారు చాలామంది.

    విజయవాడలో బ్లాక్ టికెట్లకు అవకాశమివ్వని ఏకైక ధియేటర్ ఇదేనని ప్రసిద్ధి! అన్నట్టు- కూలీనాలీ తినే పదార్థాల్లో రుచికరమైనవీ, పరిశుభ్రమైనవీ చాలానే ఉన్నాయి. చిన్నచూపు చూస్తే ఎలా చెప్పండి!

    ReplyDelete
    Replies
    1. అవును..., ఇపుడు విజయవాడ లో చాలా చోట్ల దొరుకుతున్నాయి ఈ సమోసాలు, కొన్ని ఒరిజనల్స్ కొన్ని డూపులు. డూపులు కూడా ఒరిజనల్స్ లానే ఉన్నాయి.

      Delete
  3. Same Feeling...God

    ReplyDelete
  4. One more specialty of Navarang Theater is that:

    1. It was once a Drama Theater
    2. Only theater where Ques are not regulated by very sturdy iron girders. People who come to Nvarang Theater stand que and do not jostle and crowd around the counter.

    ReplyDelete
  5. Vijayawadalo Navarang theater anubhuthule veru.. ippudu vundo..ledo.. 1980s lo memu Navarang Teataganide nidrapattedi kadu. VJAlo Toli 3D indulone release ayyindi.. A.C.ki idi Spl. Dini tarvathe A Theatre aina..

    ReplyDelete
    Replies
    1. నిజం... థియేటర్ లోకి అడుగు పెట్టగానే ఒక విధమైన అనుభూతి కలిగేది

      Delete

Trend N track

Trend N track
YouTube Channel