చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్. ఇకపై మరిన్ని వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉసిరి ఇందుకు బాగా ఉపకరిస్తుంది.
ప్రతిరోజూ ఓ ఉసిరికాయ రసం తాగండి.
హెన్నా పొడిలో కూడా ఉసిరిపొడిని కలుపుకోవాలి. అయితే హెన్నా తెల్లజుట్టును రెడ్డిష్ బ్రౌన్‌గా మార్చుతుంది. రెండు మూడు కప్పుల నీటిలో గుప్పెడు ఎండు ఉసిరికాయలు నానబెట్టి మరునాటి ఉదయం వడకట్టి, కాయల గుజ్జు రుబ్బి హెన్నా పొడిలో కలుపుకోవాలి.
నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి టీ స్పూన్లు, పచ్చి గుడ్డుసొన, రెండు టీస్పూన్ల నూనె, వడగట్టిన ఉసిరి రసం కలిపి చక్కని పేస్ట్ తయారు చేసి రెండు మూడు గంటలు అలాగే నాననిచ్చి జుట్టుకు అప్లయ్ చేయాలి. కనీసం రెండు గంటలసేపుంచి కడిగేయాలి.
No comments:
Post a Comment