Pages

Showing posts with label walk. Show all posts
Showing posts with label walk. Show all posts

05 December, 2010

ఏకాగ్రత: తల దువ్వుకునేప్పుడు దువ్వుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నాడో మేధావి.

ఆరోగ్యంగా ఉండేందుకు ఏకాగ్రతతో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌తో పనిచేస్తూనో భోజనం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వార్తా పత్రికలు, పుస్తకాన్ని చదువుతూ భోజనం చేయకూడదు. దీంతో మీలో ఏకాగ్రత నశిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
                       మీలో ఏకాగ్రత పెరిగేందుకు ప్రతి రోజు కనీసం 20 నిమిషాలపాటు ధ్యానం చేయండి. ధ్యానం చేయడంతో మీలోనున్న ఒత్తిడి తగ్గి శరీరంలో మరింత శక్తి పెరుగుతుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకండి. ఈ రెండింటిమధ్య సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఏకాగ్రత చాలా అవసరం. దీనికిగాను మీరు మీ జీవనశైలిని మార్చుకోక తప్పదు. జీవనశైలిని మార్చుకుంటే మీలో శక్తిసామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. దీంతో జీవితాంతం సుఖంగా, ఆరోగ్యంగా ఉండగలరంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
                       అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోండి. ఇది మీకు ప్రకృతిపరంగా లభించే టానిక్ లాంటిది. నిద్రతో శరీరానికి మరింత శక్తిని అందించినవారవుతారు. నిద్రలేమితో ఒత్తిడి, కళ్ళకింద నల్లటి చారలు, అధిక రక్తపోటు తదితర సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలంటున్నారు వైద్యులు.

26 November, 2010

మోకాళ్ళ నొప్పులకు జోళ్ళు లేకుండా...


మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు జోళ్ళు(చెప్పులు) లేకుండా నడిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి జోళ్ళు లేకుండా నడిచేలా ఇటీవల తాము పరిశోధనలు నిర్వహించామని పరిశోధకులు తెలిపారు. జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కొందరు ట్రైనర్ మేజోళ్ళు ధరించి నడుస్తుంటారు. దీంతో అందులోనున్న ప్యాడ్ మోకాళ్ళు, పాదాలు, అరికాళ్ళపై తీవ్రమైన ప్రభావం పడుతుండటం తాము గమనించామని, దీంతో మోకాళ్ళ నొప్పులు లేని వారికి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో జోళ్ళు లేకుండా నడిస్తే కాళ్ళకు మంచి వ్యాయామంతోపాటు బలం కూడా చేరుకూరుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు.  
నడక, జాగింగ్ చేసేటప్పుడు జోళ్ళు ధరించకుండానే నిత్యం వ్యాయామం చేస్తే చాలా సౌకర్యవంతంగాను, మోకాళ్ళ నొప్పులు రాకుండాను ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Trend N track

Trend N track
YouTube Channel