పలు దుకాణాల్లో అత్యంత రహస్యమైన కెమెరాలను అమర్చినట్లు సమాచారం. అలాగే కాల్ సెంటర్లలోని విశ్రాంతి గదులు, పలు కార్యాలయాల్లో మహిళలు విశ్రాంతి తీసుకునే గదుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసివుంచినట్లు వారు తెలిపారు. దీంతో మహిళలకు స్వేచ్ఛ అనేది లేకుండా పోతోందని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేసాయి.
* మీరు పనిచేసే కార్యాలయంలో ప్రత్యేకంగా మహిళలకు విశ్రాంతి గది ఉంటే అక్కడ రహస్య కెమెరాలుండవచ్చు.
* మీరు షాపింగ్ చేసే సమయంలో షాపింగ్ మాల్స్, షో రూంలు, వస్త్ర దుకాణాల్లో దుస్తులు మార్చుకునే సౌకర్యం ఉండే గదుల్లో అద్దాల వెనుక రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారేమోనని ఓ సారి పరికించి చూడండి.
* రెస్టారెంట్ లేదా హోటల్‌లో చేతులు వాష్ బేసిన్ వద్ద, మహిళల మరుగుదొడ్లలో కంటికి కనపడకుండా ఉండేలా రహస్య కెమెరాలుండవచ్చు.
* ప్రత్యేకంగా మహిళల కోసమే గదులు కేటాయించిన సమయంలో అక్కడ ఇలాంటి రహస్య కెమెరాలుండే అవకాశాలుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని మాత్రం మీరు షాపింగ్ చేయకుండా ఉండలేరు కదా!! ఇలాంటి సంఘటనలను తేలికగాను తీసుకోలేము, కాని ఏదో ఒకటి చేయాలి, చేయక తప్పదు మరి.
మహిళలు షాపింగ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలుః
* మీరు షాపింగ్ చేసే సందర్భంలో దుస్తులు మార్చుకునే గదికి వెళితే... దుస్తులు మార్చుకునే ముందు అక్కడి తలుపులు, గోడలు, అద్దం తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా రహస్య కెమెరాలున్నాయేమో చూసుకోండి. మీకు సంబంధించని వస్తువు ఏదైనా ఉంటే జాగ్రత్తగా వ్యవహరించండి.
* మీరు డ్రెస్ ఛేంజింగ్ రూం లేదా విశ్రాంతి గదిని ఉపయోగించేలాగుంటే... ముందుగా ఆ గదిని పరికించి చూడండి. తలుపులు, గోడల్లో ఎక్కడైనా గ్యాప్ ఉందేమో చూసుకోండి. లేదా కొత్తగా ఏదైనా వస్తువుంటే ఆ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించండి.
* దుస్తులు మార్చుకునే గది చిన్నదిగా ఉంటే మీరు గదిలోకి వెళ్ళగానే లైట్లను ఆర్పేయండి. దుస్తులు మార్చుకున్న తర్వాత మళ్ళీ లైట్లు వేసుకోండి. కాని చీకట్లోను రికార్డు చేసే కెమెరాలుంటాయి. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.
* డ్రెస్సింగ్ రూం లేదా రెస్ట్ రూంలో గోడలు, అద్దం వద్ద ఏదైనా నల్లటి చుక్క లేదా చిన్న లైటుంటే మీరు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి.
డ్రెస్సింగ్ రూంలోనున్న అద్దాన్ని పరీక్షించండిలాః
అద్దం వెనుక రహస్య కెమెరా ఉందేమో చూసుకోండి. అద్దం సాధారణంగానే కనపడుతుంది. కాని మరోవైపు మిమ్మల్ని పసిగడుతుంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... మీ చేతి వేలి కొనను అద్దంపై ఉంచండి. మీ వేలి నీడ అద్దంపై కాసింత తేడాతో పడితే లేదా అద్దంపై ఏ మాత్రం గ్యాప్ ఉంటే అది మంచి అద్దంగానే భావించవచ్చు. దీంతో మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. కాని మీ వేలికి అద్దానికి మధ్యలో దూరం లేకపోతే జాగ్రత్త వహించండి. ఆ అద్దం వెనుక రహస్య కెమెరా ఉండొచ్చు.
Thanks for the tips!
ReplyDelete"కాని మీ వేలికి అద్దానికి మధ్యలో దూరం లేకపోతే జాగ్రత్త వహించండి. ఆ అద్దం వెనుక రహస్య కెమెరా ఉండొచ్చు". అల వుంటే రహస్య కేమెర వుండటం అని చెప్పటం కన్నా అది transparent గ్లాస్ అని చెప్పటం సబబు. ఆ అద్దానికి అవతల ఉన్న వాళ్ళకి transparent glass గా వుంటుంది కాని లోపలి వాళ్ళకి అద్దం ల నే అనిపిస్తుంది. ఏమైనా ముఖ్యమైన విషయాలు తెలియ చేసారు
ReplyDelete