ఉత్తర ఆంబ్రియా కళాశాల నిపుణులు జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. అబ్బాయిలు కనీసం అమ్మాయిలను హైహీల్స్ వేసుకోమని కూడా చెప్పరని, కొందరు స్త్రీ, పురుషులపై జరిపిన పరిశోధనలో వారు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా హైహీల్స్ ధరించే యువతులు, హైహీల్స్ ధరించని యువతులపై పురుషుల స్పందనను వారు పరిశీలించారు.
స్త్రీలు ధరించే హీల్స్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేదని వారు గుర్తించారు. "స్త్రీలు అందంగా కనబడటం కోసం అనవసరంగా హైహీల్స్‌పై డబ్బు ఖర్చు చేస్తారు, అది వారి ఆరోగ్యానికే ప్రమాదం.. సహజంగానే వారు అందంగా ఉంటారనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. మానవులకు సంబంధాలు చాలా ముఖ్యం" అని డే నీవే అన్నారు.
"హై హీల్స్" ఇంకో మాటలో చెప్పాలంటే మునివేళ్ళ మీద నడవటం. ఇది చూడడానికి బానే వుంటుంది కానీ... ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలానే ఉంటాయి. మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్(ఎముకుల డాక్టర్)లు అంటున్నారు.
మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తద్వారా కండరాల కదలిక భారమై మోకాలి జాయింట్లు అరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మీకు హీల్స్ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే డాక్టరును సంప్రదించి ఎంత ఎత్తు వరకూ హీల్ వాడవచ్చనే విషయాన్ని దృవీకరించుకొని మరీ వాడితే మంచిది.
సిగరెట్లు తాగొద్ద౦టే ఎవడైనా/ఎవత్తైనా వి౦టారా? ఇదీ అ౦తే.
ReplyDelete