Pages

08 December, 2010

నిత్య యవ్వనానికి బీట్రూట్, ముడతలు పోగొట్టే కోడిగుడ్డు సొన...


యవ్వనంగా కనపడేందుకు బీట్‌రూట్ రసం సేవిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, బీటా కెరోటిన్, పీచు పదార్థాలతోపాటు ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ ముదురు ఎరుపు రంగును సంతరించుకునేందుకు ప్రధాన కారణం ఇందులో ఆంధో సైనడిన్లుండటమేనని పరిశోధకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయాన్నే పరకడుపున బీట్‌రూట్ రసాన్ని సేవిస్తే శరీరానికి కావలసిన రక్త శాతాన్ని మరింతగా పెంచుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం రక్తకణాలపైనున్న అధిక కొవ్వును తొలగించి, మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. బీట్‌రూట్‌లో బిటైన్ అనే పోషకం అధికంగా ఉండటం మూలాన శరీరంలో నిల్వవున్న చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. దీంతో నిత్యం యవ్వనులుగా ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. 
                  శరీరంలోని వివిధ భాగాలలోను, ముఖంపై ముడతలు పడకుండా ఉండేందుకు కోడిగ్రుడ్డును ఉపయోగించండి. గ్రుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కళ్ళకు తగలకుండా ముఖానికి పూయండి. అలాగే గొంతు, బాహు మూలాల వద్ద కూడా పూయండి. ఇలా పదినిమిషాలుంచిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తెల్లసొన చర్మంపైనున్న రంద్రాలను పటిష్టవంతం చేస్తుంది. దీంతో వదులుగా మారే చర్మం కాస్త గట్టిపడుతుంది. దీంతో ముడతలు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel