Pages

11 November, 2010

ఓవర్ టైం చేస్తున్నారా...అయితే !!


ప్రస్తుతం చాలామంది ఓవర్ టైం జాబ్ చేసి ఎక్కువ సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటుంటారు. అధిక సమయం పనిచేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు చాలామంది. కార్యాలయాల్లో సాధారణ పనివేళల్లో పనులు పూర్తి చేసి మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగానే ఉంటారు.

కాని ప్రపంచంలోని దాదాపు 60 శాతంమంది ప్రజలు అదనపు పని వేళల్లో పనిచేసి గుండె సంబంధిత జబ్బులను కొని తెచ్చుకుంటున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని యూనివర్శిటీ కాలేజ్ లండన్, ఫిన్నిష్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థలకు చెందిన పరిశోధకులకు నాయకత్వం వహించిన మరియన్నా విర్తానేన్ తెలిపారు.

తాము గత 11 సంవత్సరాలపాటు తాము 6,014 మందిని పరిశోధించినట్లు ఆమె తెలిపారు. తాము పరిశోధనలు ప్రారంభించిన సమయంలో (1990) వారి గుండెలు ఆరోగ్యంగానే ఉన్నాయి. పదకొండు సంవత్సారలపాటు పరిశోధించిన తర్వాత వీరిలో 369 మంది గుండె సంబంధిత జబ్బులతో మృతి చెందారు. మృతి చెందినవారు అధిక పనిభారాన్ని తట్టుకోలేక, మానసికపరమైన ఒత్తిడి కారణంగా గుండె జబ్బులతో మృతి చెందినట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆమె వివరించారు.

పనివేళల్లో పనిచేసి అదనంగా మరో నాలుగు గంటలపాటు ఓవర్ టైం పని చేసిన వారిలో అధిక బరువు, కొవ్వు శాతం పెరిగిపోయిందని, పైగా గుండె సంబంధిత జబ్బులున్నట్లు తాము కనుగొన్నామని ఆమె తెలిపారు. అదే ఓవర్ టైం పని చేయనివారిలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆమె చెప్పారు.
    
తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు ఓవర్ టైం చేయకుండా ఉండటమే ఎంతో మంచిదని ఆమె సూచించారు. ఇదిలావుంటే... ఓవర్ టైం చేయడం వలన మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి తదితర జబ్బులు ప్రాథమిక దశలో తలెత్తుతాయి. దీంతో శరీరం సహకరించకపోవడం జరుగుతుంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే అనారోగ్యంబారిన పడక తప్పదంటున్నారు పరిశోధకులు.

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel