ఎన్నో వ్యాధులు, దుర్ఘటనల వల్ల నొప్పులతో సతమతమవు తుంటారు. ఇలాంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మందులతో పాటు ఫిజియోథెరపీ అద్భుతంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.ఫిజియో థెరపీలో భాగంగా మసాజ్, రోల్ఫింగ్‌లాంటి పద్ధతులతోనూ, శరీరంలోని కీలక భాగాలను సున్నితంగా నొక్కడం ద్వారా రకరకాల విపరీతమై నొప్పులను బాగా తగ్గించ వచ్చని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. మెత్తని శరీరభాగాలపై స్వల్ప ఒత్తిడితో రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఇక రోల్ఫింగ్ ప్రక్రియలో కండరాల చుట్టూ ఉండే కణజాలంలో చేతులు, బొటనవేలు, వేలి కణుపులు, మో చేతులు ఉపయోగించి ఒత్తిడి కలగజేస్తారు. బాధితుల తల, మెడ, వెన్నెముకలను ఓ క్రమంలో ఉంచడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చని పరిశోధకులు వివరించారు.
మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా కణతలు, కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.
No comments:
Post a Comment