మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు జోళ్ళు(చెప్పులు) లేకుండా నడిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి జోళ్ళు లేకుండా నడిచేలా ఇటీవల తాము పరిశోధనలు నిర్వహించామని పరిశోధకులు తెలిపారు. జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కొందరు ట్రైనర్ మేజోళ్ళు ధరించి నడుస్తుంటారు. దీంతో అందులోనున్న ప్యాడ్ మోకాళ్ళు, పాదాలు, అరికాళ్ళపై తీవ్రమైన ప్రభావం పడుతుండటం తాము గమనించామని, దీంతో మోకాళ్ళ నొప్పులు లేని వారికి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో జోళ్ళు లేకుండా నడిస్తే కాళ్ళకు మంచి వ్యాయామంతోపాటు బలం కూడా చేరుకూరుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు.
నడక, జాగింగ్ చేసేటప్పుడు జోళ్ళు ధరించకుండానే నిత్యం వ్యాయామం చేస్తే చాలా సౌకర్యవంతంగాను, మోకాళ్ళ నొప్పులు రాకుండాను ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
చెప్పుల్లేకుండా ్ నడిస్తే చినచిన్న రాళ్లు పాదాలకు వత్తుకుని అనేన నాడీకేంద్రాలమీద పనిచేసి ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా మంచి సూచనలు చేసారు
ReplyDelete