Pages

Showing posts with label design. Show all posts
Showing posts with label design. Show all posts

30 January, 2011

చిన్నగదుల్ని విశాలం చేసే "వెరైటీ బెడ్స్"


అసలే ఇరుకైన గదుల్లో బెడ్స్ వేస్తే మరింత ఇరుకవుతాయి. అలాగని చిన్నసైజు మంచాలు వేస్తే సరిపోవు. మరెలా...? అందుకనే, పెద్దసైజు బెడ్ వేసుకున్నా కూడా గది విశాలంగా ఉండేలా చేసే రకరకాల బెడ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 

మర్ఫీ బెడ్స్ : ఈ రకమైన బెడ్స్ ఎత్తినట్లయితే గోడలలోకి వెళ్లిపోతాయి. పగటిపూట ఈ బెడ్స్‌ను ఎత్తేసి, రాత్రిళ్లు ఎంచక్కా వాల్చుకుని బెడ్‌లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మర్ఫీ బెడ్స్ బుక్ ‌షెల్ప్, టీవీ, స్టీరియో స్టాండ్‌ల్లాగా కూడా లభ్యమవుతున్నాయి.

ట్రండిల్‌ బెడ్స్ : పిల్లలు కూడా మీతోపాటే పడుకునేటట్లయితే ట్రండిల్‌ బెడ్స్ అయితే మంచిది. ఈ రకం బెడ్స్‌లో ఒకదాని కింద మరో బెడ్‌ ఉంటుంది. రాత్రుళ్లు కింద బెడ్‌ను బయటకు లాగి వాడుకుని, పొద్దున్నే మళ్లీ లోపలికి నెట్టేయవచ్చు. అయితే పైనున్న బెడ్‌ కన్నా కింద బెడ్‌ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది. ఎత్తు కూడా కొంచెం కిందికే ఉంటుంది.

సోఫా కమ్‌ బెడ్స్ : సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్స్‌లో పిల్లలతో ఉండేవారికి ఈ సోఫా కమ్‌ బెడ్స్ బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా బెడ్‌రూమ్‌ లేకపోయినా... ఈ బెడ్‌ కొన్నట్లయితే అదే రాత్రుళ్లు పిల్లలకు బెడ్‌లా పనికివస్తుంది. పగటి పూట దాన్నే లివింగ్‌ రూమ్‌లో సోఫాలా వాడుకోవచ్చు. సోఫా కింద ఉండే స్థలంలో దుప్పట్లు, దిండ్లు, దిండు కవర్లు లాంటివి కూడా భద్రపరచుకోవచ్చు.

ఫ్యుటాన్స్ : తరచూ ట్రాన్స్‌ఫర్లు అయ్యేవారికి మంచాలను ఊడదీయడం, మళ్లీ బిగించడం పెద్ద తలనొప్పి. అలాంటి వారికోసం ఉపయోగపడేవి ఫ్యూటాన్స్ బెడ్స్. వీటిని అసరమైతే బెడ్‌లాగా వాడుకోవచ్చు. వద్దనుకుంటే, వాటిని చుట్టచుట్టి మెత్తటి సోఫాలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి సింగిల్, డబుల్ సైజుల్లో కూడా లభ్యమవుతున్నాయి.

బంక్‌ బెడ్స్ : పిల్లల గది చిన్నగా ఉందని బాధపడకుండా... ఎంచక్కా బంక్ బెడ్స్‌ను కొనేయండి. సింగ్ బెడ్ మీద ఇంకో బెడ్ ఉంటుంది. పైగా వీటిని పగటిపూట ఎత్తిపెట్టాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా ఈ బంక్ బెడ్స్‌ను బాగా ఇష్టపడతారు. సరే, వెంటనే కొనేద్దామా మరి...

22 November, 2010

మాగ్నెట్ బాల్స్ తో మాగ్నెట్ టాయ్స్ తయారు చేద్దామా...

మాగ్నెట్ బాల్స్ తో మాగ్నెట్ టాయ్స్ తయారు చేయడం పిల్లలకే కాదు పెద్దలకూ సరదానే...


21 November, 2010

పడకగది అలంకరణ


  • పడకగది అలంకరణలో ఇష్టాయిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటంకంటే మానసిక ఉపశమనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి. గోడల రంగులు, తలుపులకు వేసే కర్టెన్లు, కిటికీలకు వేసే కర్టెన్లు లాంటివి కంటికి భారంగా కనిపించకుండా.. గదిలోకి వెళ్లగానే మనసుకు ఉపశమనం కలిగించేలా అమర్చుకోవాలి.
  •  పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చినవారికి మంచంపై పడుకోగానే నిద్రపట్టేలా పడకగది ఉంటే సరిపోతుంది. నిద్ర సరిగా పట్టాలంటే పడకగదిలో ప్రకాశవంతమైన లేదా ముదురు రంగులు ఉండకూడదు. గదులకు ముదురు రంగులతో పెయింట్ వేయించకూడదు. గదిలో అడుగుపెట్టగానే మానసిక ఉల్లాసాన్నిచ్చేలా ఉండే లైట్ కలర్స్‌ను పడకగది గోడలకు వేయించాలి.
  • పడకగది గోడలకు తగిలించే బొమ్మలు, వాల్ హేంగింగ్‌ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పనిలేదు. ఖరీదైన వస్తువులు కొనడం మాని, పిల్లలు స్వంతంగా వేసిన డ్రాయింగ్ కాని పెయింటింగ్ కాని ఫ్రేమ్ కట్టించి తగిలించండి. దీనివల్ల గది గోడలకు కొత్త అందం రావడమే కాక పిల్లలు కూడా తమ పెయింటింగులను చూసుకుని ఆనందిస్తారు. సిట్టింగ్ రూం గోడలకు లేదా పిల్లల బెడ్ రూంలో వాల్ హేంగింగ్స్ తగిలిస్తే గది వెలుగులు విరజిమ్ముతుంది.

19 November, 2010

లివింగ్ రూమ్‌కు మిర్రర్‌తో మ్యాజిక్...


  •  గదుల అందాన్ని పెంచటంలో అద్దాల పాత్రను కాదనలేం. లివింగ్‌రూమ్‌లో గోడకు అందమైన వాల్‌పేపర్‌గానీ, దృశ్య ప్రధాన ఫొటోగానీ ఉంటే దానిపక్క అద్దం అమర్చితే చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అంతేగాకుండా ఆ గది కూడా ఎంతో విశాలంగా కనిపిస్తుంది.
  •  సహజమైన వెలుతురు అంతగా ప్రసరించని గదిలో కిటికీ దగ్గర మంచి డిజైన్‌ మిర్రర్‌ని వేలాడదీస్తే అందంతో పాటు వెలుగూ లోనికి ప్రసరిస్తుంది. పడకగది, వంటగది, డైనింగ్‌హాల్‌ లేదా లివింగ్‌రూమ్‌ చిన్నగా ఉంటే అక్కడ గోడకు మంచి డిజైనర్‌ మిర్రర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఆ గదికి కొత్త అందం వస్తుంది, గది కాంతిమయమై విశాలంగా కనిపిస్తుంది.
  • అద్దాలను శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో ప్రత్యేక షాంపూలు లభిస్తున్నాయి. వాటిని పేపర్‌ టవల్‌మీద స్ప్రే చేసి దానితో అద్దాన్ని తుడిస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది. అద్దం వెనుక దుమ్ముపడితే గుడ్డతో తుడిచేయాలే కాని షాంపూ మాత్రం వాడకూడదు. అద్దాలు దుమ్ముపట్టి నల్లగా, అసహ్యంగా మారకూడదంటే పేపర్‌ టవల్‌పై షాంపూ వేసి అద్దాల అంచులను తరచుగా శుభ్రం చేయాలి.
  • అద్దాన్ని తుడిచేటప్పుడు, మధ్యలోనుంచి ప్రారంభించి చివరలతో ముగించాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు. అంచులపై షాంపూ ఎక్కువగా పడితే సిల్వర్‌ మెరుపు అంతా పోయి నల్లగా మారిపోవచ్చు.

14 November, 2010

'ఓపెన్ కిచెన్' ‌తో లాభాలు...


  • ఓపెన్ కిచెన్‌కు నాలుగ్గోడలు ఉండవు. వంటిల్లంతా తెరచిన పుస్తకంలా ఉంటుంది. వంట చేసుకుంటూ టీవీ చూడవచ్చు, పాటలు వినవచ్చు, పిల్లల హోంవర్కులో సాయం చేయవచ్చు.
  • ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ వంటగది కనిపిస్తుంది కాబట్టి, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం. దీంతో వంటిల్లు నూనెతో జిడ్డోడుతూ అపరిశుభ్రంగా ఉండే బాధకు వంటింట్లోకి సహజసిద్ధమైన గాలీ, వెలుతురూ ధారాళంగా ప్రసరించటమో అనుకూలాంశం.
  • ఓపెన్ కిచెన్‌ అనేది కేవలం సంపన్నులకే పరిమితమేనేం అనుకోవాల్సిన అవసరం లేదు. 150 గజాల ఇంట్లో అయినా, వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌లో అయినా సరే రూపొందించుకోవచ్చు. హాల్, లివింగ్ ఏరియాతోపాటు వంటగది కూడా బయటికి కనిపిస్తుంది కాబట్టి ఇల్లు చాలా విశాలంగా కనిపించే అవకాశం ఉంది.
  • గోడలు, ఫ్లోరింగ్‌ పూర్తికాక ముందే ఓపెన్ కిచెన్ విధానానికి అంకురార్పణ జరగాలి. ఒకవేళ ఇప్పటికే ఈ పనులన్నీ పూర్తయితే.. విరగ్గొట్టే గోడకు సంబంధించిన ఆనవాళ్లు బయటికి కన్పించకుండా జాగ్రత్తపడాలి. అయితే ఇంట్లో వాడే ఫ్లోరింగ్‌, గోడలకు వేసే రంగులు ఒకేలా ఉండేలా చూసుకోవాలి.  

Trend N track

Trend N track
YouTube Channel