- గదుల అందాన్ని పెంచటంలో అద్దాల పాత్రను కాదనలేం. లివింగ్‌రూమ్‌లో గోడకు అందమైన వాల్‌పేపర్‌గానీ, దృశ్య ప్రధాన ఫొటోగానీ ఉంటే దానిపక్క అద్దం అమర్చితే చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అంతేగాకుండా ఆ గది కూడా ఎంతో విశాలంగా కనిపిస్తుంది.
- సహజమైన వెలుతురు అంతగా ప్రసరించని గదిలో కిటికీ దగ్గర మంచి డిజైన్ మిర్రర్‌ని వేలాడదీస్తే అందంతో పాటు వెలుగూ లోనికి ప్రసరిస్తుంది. పడకగది, వంటగది, డైనింగ్‌హాల్ లేదా లివింగ్‌రూమ్ చిన్నగా ఉంటే అక్కడ గోడకు మంచి డిజైనర్ మిర్రర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఆ గదికి కొత్త అందం వస్తుంది, గది కాంతిమయమై విశాలంగా కనిపిస్తుంది.
- అద్దాలను శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో ప్రత్యేక షాంపూలు లభిస్తున్నాయి. వాటిని పేపర్ టవల్‌మీద స్ప్రే చేసి దానితో అద్దాన్ని తుడిస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది. అద్దం వెనుక దుమ్ముపడితే గుడ్డతో తుడిచేయాలే కాని షాంపూ మాత్రం వాడకూడదు. అద్దాలు దుమ్ముపట్టి నల్లగా, అసహ్యంగా మారకూడదంటే పేపర్ టవల్‌పై షాంపూ వేసి అద్దాల అంచులను తరచుగా శుభ్రం చేయాలి.
- అద్దాన్ని తుడిచేటప్పుడు, మధ్యలోనుంచి ప్రారంభించి చివరలతో ముగించాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు. అంచులపై షాంపూ ఎక్కువగా పడితే సిల్వర్ మెరుపు అంతా పోయి నల్లగా మారిపోవచ్చు.
No comments:
Post a Comment