Pages

24 December, 2011

నేను చిరంజీవి ఫాన్ అయిన విధంబెట్టిదన... 'ఖైదీ' తో మాత్రం కాదు...


                      నేను మొదట్లో కృష్ణ ఫాన్ ని. అంటే NTR అంటే ఇష్టం లేదని కాదు. NTR బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, పౌరాణికాలు అంటే కూడా ఇష్టమే. NTR ఇక రాజకీయాలలోకి వెళ్ళాక, ఆహా...., ఇక కృష్ణ సూపర్ స్టార్ అని చంకలు గుద్దుకుంటుంటే, చిరంజీవి ఎంటర్ అయాడు. అప్పటిదాకా క్లాస్ లో పిల్లలంతా NTR ఫాన్స్, కృష్ణ ఫాన్స్ గా ఉండే రెండు గ్రూపులు రూపాంతరం చెంది కృష్ణ ఫాన్స్, చిరంజీవి ఫాన్స్ గా మారాయి. ఎర్రగా బుర్రగా అందంగా ఉండే కృష్ణ ఫైట్లూ..., శ్రీదేవి, జయప్రదలతో అంటీ ముట్టనట్లు గా తన శైలిలో వేసే స్టెప్పులూ చూస్తూ, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది అనుకుంటూ కృష్ణ ఫాన్ గా ఉండేవాడిని. 
                      ఈ లోపు చిరంజీవి ఖైదీ గా, గూండా గా ఎంటర్ అయాడు. మా పిల్లకాయలకు కొత్త హీరో దొరికాడు. చిరంజీవి డాన్సులూ, ఫైట్లూ బాగా చేసినా నేను అంత తొందరగా చిరంజీవి ఫాన్ గా మారలేదు, కాని కృష్ణ కన్నా బాగా చేస్తున్నాడే అనుకున్నా. పైగా ఖైదీ, గూండా సినిమా లలో కొంచెం వయొలెన్స్, ఏడుపు సెంటిమెంట్ సీన్లు ఉండడంతో నాకు ఎక్కలేదు. ఇహ..., తరువాత 'దొంగ' సినిమా రిలీజ్ అయింది. రాధ హీరోయిన్. ఆ సినిమాలో చిరంజీవి ఎంట్రన్స్ సీన్ అదిరిపోయింది, కొంతమంది దొంగలు దొంగతనం చేసి పారిపోడానికి కారెక్కి స్టార్ట్ చేస్తే కారు కదలదు, ఇంతా అని కిందకి దిగి చూస్తే కారు కి టైర్లు ఉండవు. టైర్లు కోసం చూస్తే పక్క గోడ మీద వరసగా పేర్చి ఉంటాయి. తెరమీద ఒకో టైరూ, ఒకో టైరూ కనబడుతూ ఉంటే, ఆఖరి టైరు వెనక చిరంజీవి చాలా స్టైల్ గా కూర్చుని సిగరెట్ కాలుస్తుంటాడు. ఆ తరువాత ఫైట్ కూడా కామెడీ టచ్ తో ఉంటుంది. ఆ సీన్ దెబ్బకు అర్జెంట్ గా చిరంజీవి ఫాన్ గా మారిపోయా. 
                      అసలు 'చిరంజీవి సినిమా' అనేది 'దొంగ' తో మొదలైంది. ఖైదీ అనేది చిరంజీవి కి ఒక గుర్తింపు తెచ్చింది. కానీ చిరంజీవి స్టైల్ మాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ 'చిరంజీవి సినిమా' మాత్రం 'దొంగ' తో మొదలైంది. తెలుగు సినిమా లో కొత్త ఫార్ములా మొదలైంది. అలాగే..., 'దొంగ మొగుడు' సినిమా లో కుష్టువాడిగా తోపుడు బండి పై కూర్చుని తోసుకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకునే సీన్..., ఇలా పక్కా కామెడీ మాస్ సీన్ లు చేస్తూ మాస్ ప్రేక్షకుల మది లోకి చొచ్చుకుపోయాడు చిరంజీవి. రజనీ కాంత్, అమితాబ్ కూడా ఇలాంటి మాస్ సీన్లు అవలీలగా చేసారు కాబట్టే సూపర్ స్టార్లు అయారు. కాబట్టి సూపర్ స్టార్ల అసలు ఫార్ములా ఈ 'మాస్'.
                       అసలు హీరో గా ఎలివేట్ అవాలంటే మంచి బలమైన విలన్ కావాలి. దానికి రావు గోపాలరావు ఉన్నాడు. కృష్ణ సినిమా అయినా, చిరంజీవి సినిమా అయినా ముందు విలన్ గా రావు గోపాలరావు ఉన్నాడా లేదా అని కూడా చూసుకునే వాళ్ళం. సరే..., మరికొన్ని కబుర్లుతో మళ్ళీ కలుద్దాం.

1 comment:

Trend N track

Trend N track
YouTube Channel