- ఓపెన్ కిచెన్‌కు నాలుగ్గోడలు ఉండవు. వంటిల్లంతా తెరచిన పుస్తకంలా ఉంటుంది. వంట చేసుకుంటూ టీవీ చూడవచ్చు, పాటలు వినవచ్చు, పిల్లల హోంవర్కులో సాయం చేయవచ్చు.
- ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ వంటగది కనిపిస్తుంది కాబట్టి, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం. దీంతో వంటిల్లు నూనెతో జిడ్డోడుతూ అపరిశుభ్రంగా ఉండే బాధకు వంటింట్లోకి సహజసిద్ధమైన గాలీ, వెలుతురూ ధారాళంగా ప్రసరించటమో అనుకూలాంశం.
- ఓపెన్ కిచెన్ అనేది కేవలం సంపన్నులకే పరిమితమేనేం అనుకోవాల్సిన అవసరం లేదు. 150 గజాల ఇంట్లో అయినా, వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌లో అయినా సరే రూపొందించుకోవచ్చు. హాల్, లివింగ్ ఏరియాతోపాటు వంటగది కూడా బయటికి కనిపిస్తుంది కాబట్టి ఇల్లు చాలా విశాలంగా కనిపించే అవకాశం ఉంది.
- గోడలు, ఫ్లోరింగ్ పూర్తికాక ముందే ఓపెన్ కిచెన్ విధానానికి అంకురార్పణ జరగాలి. ఒకవేళ ఇప్పటికే ఈ పనులన్నీ పూర్తయితే.. విరగ్గొట్టే గోడకు సంబంధించిన ఆనవాళ్లు బయటికి కన్పించకుండా జాగ్రత్తపడాలి. అయితే ఇంట్లో వాడే ఫ్లోరింగ్, గోడలకు వేసే రంగులు ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
No comments:
Post a Comment