Pages

Showing posts with label life style. Show all posts
Showing posts with label life style. Show all posts

19 May, 2011

కర్మ సిద్ధాంతం ప్రకారం..., కర్మ అనేది...

ఇది నా సొంత అభిప్రాయం..., కాబట్టి ఇది ఎక్కడ చదివావురా బాబూ..., అని అడక్కండే...

కర్మ అనేది భగవంతుడి కన్నా అతీతమైనది. ఆ భగవంతుడు కూడా తప్పించుకోలేడీ కర్మను. విష్ణువు దశావతారాలు ఎత్తాడు, రాముడు, కృష్ణుడు వగైరా అవతారాలలో కొన్ని కష్టాలు పడ్డాడు, ఇంద్రుడు, చంద్రుడు... ఇలా ఎవరూ కర్మకు అతీతులు కారు. రామునికి అరణ్య వాసం తప్పలేదు, అలాగే కృష్ణుడు వేటగాని బాణం దెబ్బకు అవతారం చాలించక తప్పలేదు. ఏమన్నా అంటే విష్ణువు దశావతారాలు లోకకల్యాణం కోసం, దుష్ట శిక్షణ..., శిష్ట రక్షణ కోసం అంటారు. కానే కాదు, ఇక్కడ విష్ణువు అన్ని అవతారాలలోనూ అతని శత్రువులు, అతని ద్వారపాలకులు జయ విజయులే విష్ణువు కు శత్రువులు గా జన్మించారు. ఇక్కడ వారి వారి కర్మ ల ఫలితమే ఈ దశావతారాలు కావచ్చు. 

సరే..., దేవుళ్ళ సంగతి తరువాత. ప్రతి జీవి కి, వారి కర్మల ప్రకారం, అంటే చెడు కర్మల, మంచి కర్మల  ఫలితాలు వాటి జన్మలకు అతీతం గా అనుభవిస్తుంటారు. కొంతమంది ఈ జన్మ లో మంచి కర్మలు చేస్తున్నా, పూర్వ జన్మ ల కర్మ ల ప్రభావం వల్ల కష్టాలు అనుభవిస్తుంటారు. మరి కొంతమంది ఈ జన్మ లో చెడు కర్మలు చేస్తున్నా, పూర్వ జన్మల కర్మ ల ప్రభావం వల్ల సుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఈ జన్మలో చేసిన కర్మ ల ఫలితం ఈ జన్మ లోనే అనుభవించాలని ఉండదు. ఇప్పుడు కష్టాలు పడుతున్నామని పూజలు పునస్కారాలు చేసేస్తే భగవంతుడు అర్జెంటు గా మన కష్టాలు తీర్చలేడు. మన కర్మల ఫలితాన్ని భగవంతుడు కూడా మార్చలేడు. అందుకే కొందరు భగవంతుని పై ఆశలు, నమ్మకం వగైరాలు పెట్టుకోకుండా మంచి కర్మలు చేస్తూ ప్రశాంతం గా బ్రతికేసే కొంతమందిని  మనం సమాజం లో చూస్తూంటాం. అలాంటి వాళ్ళను ఆదర్శం గా తీసుకుందాం.

సరే..., వాడెవడో చెడు చేస్తున్నాడని, లేదా మనకు చెడు చేసాడని, దానికి తగ్గ ఫలితం వాడు అనుభవించాలని మనం వాడికి చెడు చేయాలని ప్రయత్నిస్తే, వాడి సంగతి తరువాత, ముందు మనం చెడు కర్మ చేసినవారమవుతాం. అలా అని మనం ఊరుకోవాలా...? అంటే..., చెడు కర్మలు చేయకుండా అతన్ని face చేయండి. 

అలాగే, కర్మ అనేది సమాజం లోని కట్టుబాట్లకు సంబంధించింది కూడా కాదు. సమాజం దృష్టి లో తప్పు అయినటువంటి కొన్ని కర్మలు చెడు కర్మలు కాకపోవచ్చు. కొన్ని సమాజాలకు తప్పు కానటువంటి కర్మలు చెడు కర్మలు కావచ్చు. అలాగే మననుండి ఏదో ఆశించి, భంగపడి మన ప్రమేయం లేకుండా మన వలన ఎదుటివాడు బాధపడితే అందులో మన తప్పూ ఉండక పోవచ్చు, బాధపడడం అతని కర్మ కావచ్చు. 
ఓకే... ఇదేం ఖర్మ రా బాబూ... అనుకుంటున్నారా, సరే..., ఇక ఆపుతున్నా...
అసలే దీనికి అంతం అనేది ఉండదు, ఇలా చెప్పుకుంటూ పోతే...

26 February, 2011

విజయం, లక్ష్యం, గమ్యం కోసం మన జీవన విధానం సరళం గా ఉంటే చాలు..., కఠినం గా కాదు.


జీవితం పట్ల ఆశావహ దృక్పధం కలిగి ఉన్న మానవునికి  ఎంతటి లక్ష్య మైన కఠినం గా ఉండదు.  అటువంటి దృక్పధాన్ని అలవరించేకుందుకు ఉపకరించే  సూత్రాలు మీ కోసం...
 
1. మీకు చేతనైన రీతిలో అభినందించడం ప్రారంభించండి.
...మీ ప్రశంసలు అందుకునే వాటిలో మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం, పార్కులో ఆడుకునే పిల్లలు, మీకు నచ్చిన భోజనంతో పాటు మీ సహచరుల, ఇతరుల గెలుపును... అభినందించండి... ఆస్వాదించండి. 
 
2.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి.
...ఇతరులతో పోల్చుకుని, వారిని అందుకునే ప్రయత్నంలో మీరు  తపన, ఆరాటం, ఒత్తిడి కు లొంగనవసరం లేదు...

3. సందర్భాన్ని అనుసరించి స్పందించండి.
... సందర్భాన్ని అనుసరించి ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయాధికారం మీదిగా చేసుకోండి.

4. మీ అంతట మీరుగా తెలుసుకోండి.
ఏదైనా విషయాన్ని మీ అంతట మీరుగా తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం వలన ఆశావహ జీవితాన్ని గడపవచ్చు.

5. చర్యకు ప్రతిచర్య.
... మీకు నచ్చని వాతావరణంలో నచ్చినట్లుగా నటించకండి.

6. ప్రస్తుతంలో జీవించండి.
అవసరానికి మించి గతకాలపు మరియు భవిష్యత్తుకు చెందిన ఆలోచనలలో ఊగిసలాడకండి

7. మానసికంగా సిద్ధం కండి.
అరుదైన, గొప్పదైన సందర్భాలలో మీ భావవ్యక్తీకరణ, వ్యవహార శైలి, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే తీరులో మీదైన శైలిని అలవరించుకుని చిరునవ్వును ఆభరణంగా ధరించండి.

8. అపజయాన్ని ఆహ్వానించండి.
గొప్పవారి జీవితాలలోకి అనేక అపజయాల తరువాతనే విజయం అడుగు పెట్టిందని గుర్తుంచుకోండి. పొందిన విజయంతో సంతృప్తి చెందక ఇతర అవకాశాల అందుకునే క్రమంలో అపజయాలు పునరావృతమైనా వారు వెనుకంజ వేయరు. కనుక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. విజయం మీ తలుపు తట్టక మానదు.

9. కోరుకున్న వాటిపై దృష్టిని కేంద్రీకరించండి.
నూతన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేందుకు అనేకమంది కొత్త వ్యక్తులను కలవడం ప్రారంభించండి. తద్వారా గొప్ప బాంధవ్యాలను ఏర్పరుచుకుని మీ జీవితంలో ఒంటరితనాన్ని పారద్రోలండి

10. ఇతరులకు సహాయం చేయండి.
ఇతరులకు సహాయం చేయడం ద్వారా అద్భుతమైన మానసిక అనుభూతిని సొంతం చేసుకోండి.

11. ఆలోచనలను నమోదు చేయండి.
ఆలోచనల చిట్టాను వ్రాయడం ప్రారంభించండి. ఆ చిట్టాలో అత్యధిక అంశాలు మీలో ఆశావహ దృక్పధాన్ని పెంచే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.తద్వారా మీ జీవితంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టండి.

30 January, 2011

చిన్నగదుల్ని విశాలం చేసే "వెరైటీ బెడ్స్"


అసలే ఇరుకైన గదుల్లో బెడ్స్ వేస్తే మరింత ఇరుకవుతాయి. అలాగని చిన్నసైజు మంచాలు వేస్తే సరిపోవు. మరెలా...? అందుకనే, పెద్దసైజు బెడ్ వేసుకున్నా కూడా గది విశాలంగా ఉండేలా చేసే రకరకాల బెడ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 

మర్ఫీ బెడ్స్ : ఈ రకమైన బెడ్స్ ఎత్తినట్లయితే గోడలలోకి వెళ్లిపోతాయి. పగటిపూట ఈ బెడ్స్‌ను ఎత్తేసి, రాత్రిళ్లు ఎంచక్కా వాల్చుకుని బెడ్‌లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మర్ఫీ బెడ్స్ బుక్ ‌షెల్ప్, టీవీ, స్టీరియో స్టాండ్‌ల్లాగా కూడా లభ్యమవుతున్నాయి.

ట్రండిల్‌ బెడ్స్ : పిల్లలు కూడా మీతోపాటే పడుకునేటట్లయితే ట్రండిల్‌ బెడ్స్ అయితే మంచిది. ఈ రకం బెడ్స్‌లో ఒకదాని కింద మరో బెడ్‌ ఉంటుంది. రాత్రుళ్లు కింద బెడ్‌ను బయటకు లాగి వాడుకుని, పొద్దున్నే మళ్లీ లోపలికి నెట్టేయవచ్చు. అయితే పైనున్న బెడ్‌ కన్నా కింద బెడ్‌ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది. ఎత్తు కూడా కొంచెం కిందికే ఉంటుంది.

సోఫా కమ్‌ బెడ్స్ : సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్స్‌లో పిల్లలతో ఉండేవారికి ఈ సోఫా కమ్‌ బెడ్స్ బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా బెడ్‌రూమ్‌ లేకపోయినా... ఈ బెడ్‌ కొన్నట్లయితే అదే రాత్రుళ్లు పిల్లలకు బెడ్‌లా పనికివస్తుంది. పగటి పూట దాన్నే లివింగ్‌ రూమ్‌లో సోఫాలా వాడుకోవచ్చు. సోఫా కింద ఉండే స్థలంలో దుప్పట్లు, దిండ్లు, దిండు కవర్లు లాంటివి కూడా భద్రపరచుకోవచ్చు.

ఫ్యుటాన్స్ : తరచూ ట్రాన్స్‌ఫర్లు అయ్యేవారికి మంచాలను ఊడదీయడం, మళ్లీ బిగించడం పెద్ద తలనొప్పి. అలాంటి వారికోసం ఉపయోగపడేవి ఫ్యూటాన్స్ బెడ్స్. వీటిని అసరమైతే బెడ్‌లాగా వాడుకోవచ్చు. వద్దనుకుంటే, వాటిని చుట్టచుట్టి మెత్తటి సోఫాలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి సింగిల్, డబుల్ సైజుల్లో కూడా లభ్యమవుతున్నాయి.

బంక్‌ బెడ్స్ : పిల్లల గది చిన్నగా ఉందని బాధపడకుండా... ఎంచక్కా బంక్ బెడ్స్‌ను కొనేయండి. సింగ్ బెడ్ మీద ఇంకో బెడ్ ఉంటుంది. పైగా వీటిని పగటిపూట ఎత్తిపెట్టాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా ఈ బంక్ బెడ్స్‌ను బాగా ఇష్టపడతారు. సరే, వెంటనే కొనేద్దామా మరి...

Trend N track

Trend N track
YouTube Channel