- పడకగది అలంకరణలో ఇష్టాయిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటంకంటే మానసిక ఉపశమనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి. గోడల రంగులు, తలుపులకు వేసే కర్టెన్లు, కిటికీలకు వేసే కర్టెన్లు లాంటివి కంటికి భారంగా కనిపించకుండా.. గదిలోకి వెళ్లగానే మనసుకు ఉపశమనం కలిగించేలా అమర్చుకోవాలి.
- పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చినవారికి మంచంపై పడుకోగానే నిద్రపట్టేలా పడకగది ఉంటే సరిపోతుంది. నిద్ర సరిగా పట్టాలంటే పడకగదిలో ప్రకాశవంతమైన లేదా ముదురు రంగులు ఉండకూడదు. గదులకు ముదురు రంగులతో పెయింట్ వేయించకూడదు. గదిలో అడుగుపెట్టగానే మానసిక ఉల్లాసాన్నిచ్చేలా ఉండే లైట్ కలర్స్‌ను పడకగది గోడలకు వేయించాలి.
- పడకగది గోడలకు తగిలించే బొమ్మలు, వాల్ హేంగింగ్‌ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పనిలేదు. ఖరీదైన వస్తువులు కొనడం మాని, పిల్లలు స్వంతంగా వేసిన డ్రాయింగ్ కాని పెయింటింగ్ కాని ఫ్రేమ్ కట్టించి తగిలించండి. దీనివల్ల గది గోడలకు కొత్త అందం రావడమే కాక పిల్లలు కూడా తమ పెయింటింగులను చూసుకుని ఆనందిస్తారు. సిట్టింగ్ రూం గోడలకు లేదా పిల్లల బెడ్ రూంలో వాల్ హేంగింగ్స్ తగిలిస్తే గది వెలుగులు విరజిమ్ముతుంది.
No comments:
Post a Comment