అమెరికా తో అణు ఒప్పందం టైం లో..., నెట్ లో ప్రాచుర్యం పొందిన ఒక జోక్...
జార్జ్ బుష్, ఐశ్వర్యా రాయ్, ప్రకాష్ కారత్, సోనియా గాంధి లు రైలు ప్రయాణం చేస్తుంటే ఒక సొరంగ మార్గం వచ్చింది. రైల్ అంతా కాసేపు చీకటి గా అయింది. ఆ చీకట్లో ఒక ముద్దు శబ్దం, ఆ వెంటనే ఒక చెంప దెబ్బ శబ్దం వినపడింది. ఆ తరువాత రైల్ సొరంగ మార్గం వదలి, వెలుతురు లోకి రావడం జరిగింది.
ఇహ..., అపుడు చూస్తే జార్జ్ బుష్ చెంప ఎర్రగా కంది పోయి ఉంది.
అపుడు...,
జార్జ్ బుష్ ఇలా అనుకున్నాడు..., ఆ కారత్ గాడు ఐశ్వర్యా రాయ్ ను ముద్దు పెట్టుకుని ఉంటాడు, అది నేను అనుకుని నన్ను చెంప దెబ్బ కొట్టేసింది...
ఐశ్వర్య ఇలా అనుకుంది..., ఆ బుష్ గాడు నన్ను అనుకుని సోనియాను ముద్దు పెట్టుకుని ఉంటాడు, సోనియా గాంధేయ వాదం పక్కన పెట్టి కొట్టేసింది...
సోనియా ఇలా అనుకుంది..., ఆ బుష్ గాడు ఐశ్వర్య అందం చూసి ఆగలేక ముద్దు పెట్టేసుకుంటే, ఐష్ కొట్టేసినట్టుంది, ఆ కోపం తో ఇపుడు వీడు అణు ఒప్పందం పై వెనక్కి తగ్గుతాడేమో..., పెద్ద చిక్కొచ్చి పడుతుందేమో ఇపుడు...
కారత్ ఇలా అనుకున్నాడు..., ఇపుడు మళ్ళీ ఇంకో సొరంగం వస్తే బాగుణ్ణు..., ఆ చీకట్లో మళ్ళీ ఒక ముద్దు శబ్దం నేనే చేసి, మళ్ళీ ఆ బుష్ గాడి చెంప పగలకొట్టేస్తాను... ఆ దెబ్బకు ఇక అణు ఒప్పందం వెనక్కే...

No comments:
Post a Comment