పీ.వి. నరసింహ రావు, వాజపాయ్, మన్మోహన్ వంటి ప్రధానుల పాలనలో ఆర్ధిక శక్తి గా ఎదిగిన భారత్ ఆ స్థాయిని నిలుపుకోవడం ప్రశ్నార్ధకమేనా... భిన్నత్వం లో ఏకత్వం కూడా ప్రశ్నార్ధకం కాబోతుందా...? దీనికి ఆంధ్ర ప్రదేశ్ నాంది కాబోతుందా...? జగన్, కెసిఆర్ వంటి రాజకీయ నిరుద్యోగులు సృష్టించే సంక్షోభం ఫలితం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది...? కొద్ది రోజులలో మన రాష్ట్రభవితవ్యం తేలబోతోంది. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించే విధానం భారత దేశ భవితవ్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుత మన రాష్ట్ర పరిస్థితి నుంచి తగిన గుణ పాఠాలు నేర్చుకుని ముందడుగు వేసే సామర్ధ్యం కేంద్రానికి ఉందా...?
పీ.వి. నరసింహ రావు ప్రధానిగా ఉన్నపుడు జటిలమైన సమస్యలను మారటోరియం పేరుతో పక్కనబెట్టి మన్మోహన్ ను వజ్రాయుధం లా ఉపయోగించి దేశాన్ని అభివృద్ది బాట పట్టించాడు. అదే పీ.వి. కాబినెట్ లో మంత్రి గా చేసిన చిదంబరం మాత్రం ఇప్పుడు తెలంగాణా తేనేతుట్టను కదిపాడు. పీ.వి. అపర చాణక్యుడు. మన్మోహన్ కేవలం ఆర్ధికవేత్త మాత్రమే. మరి మన్మోహన్ తరువాత...? మహాత్మా గాంధీ తరువాత, మన దేశం పై అంతటి ముద్ర వేసిన నాయకుడు పీ.వి. మాత్రమే. 90 వ దశకం లో పీ.వి. చేపట్టిన ఆర్ధిక సంస్కరణల బాట, తరువాత అధికారం చేపట్టిన BJP కూడా కొనసాగించేంత ప్రభావం చూపాడు. ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన 20 ఏళ్ళ తరువాత కూడా అంటే ఇప్పటికీ పీ.వి.ప్రభావం ఉంది అనడానికి నిదర్శనం ఇప్పుడు ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్. మన దేశ నాయకులను స్వాతంత్ర్యం ముందు, స్వాతంత్ర్యం తరువాత అని విడదీస్తే, స్వాతంత్ర్యం ముందు నాయకులలో అగ్రస్థానం మహాత్మా గాంధీ కు లభిస్తే, స్వాతంత్యం తరువాత నాయకులలో అగ్రస్థానం పీ.వి. నరసింహారావు కు లభిస్తుంది.
ప్రపంచ ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న ఆర్ధిక శక్తి భారత్ అన్ని రంగాలలోనూ వృద్ది సాధించింది, కానీ ఒక్క రాజకీయ రంగం లో తప్ప. మన్మోహన్ ఒక ఆర్ధికవేత్త మాత్రమే, పీ.వి. లాగా చాణక్యం లేదు, అందుకే ఏ. రాజా లాంటి మంత్రులను, కుంభకోణాలను అరికట్టలేకపోతున్నాడు. మన్మోహన్ లాంటి ఆర్దికవేత్తలకు కొదవ లేదు మన దేశం లో. కానీ మన దేశానికి కావాలొక పి.వి. ఇలాంటి తరుణం లో...
YSR ane paamu nu P.V. pakkana pedithe, tharuvaatha Sonia penchi poshinchinanduku ippudu phalitham anubhavisthondi.
ReplyDelete