ఆరోగ్యంగా ఉండేందుకు  ఏకాగ్రతతో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌తో పనిచేస్తూనో  భోజనం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వార్తా పత్రికలు,  పుస్తకాన్ని చదువుతూ భోజనం చేయకూడదు. దీంతో మీలో ఏకాగ్రత  నశిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
                       మీలో  ఏకాగ్రత పెరిగేందుకు ప్రతి రోజు కనీసం 20 నిమిషాలపాటు ధ్యానం చేయండి.  ధ్యానం చేయడంతో మీలోనున్న ఒత్తిడి తగ్గి శరీరంలో మరింత శక్తి పెరుగుతుంది.  మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకండి. ఈ రెండింటిమధ్య  సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఏకాగ్రత చాలా అవసరం. దీనికిగాను మీరు మీ  జీవనశైలిని మార్చుకోక తప్పదు. జీవనశైలిని మార్చుకుంటే మీలో  శక్తిసామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. దీంతో జీవితాంతం సుఖంగా, ఆరోగ్యంగా  ఉండగలరంటున్నారు ఆరోగ్య నిపుణులు.    
                       అలాగే  ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోండి. ఇది మీకు  ప్రకృతిపరంగా లభించే టానిక్ లాంటిది. నిద్రతో శరీరానికి మరింత శక్తిని  అందించినవారవుతారు. నిద్రలేమితో ఒత్తిడి, కళ్ళకింద నల్లటి చారలు, అధిక  రక్తపోటు తదితర సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి రోజు  క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలంటున్నారు వైద్యులు. 
No comments:
Post a Comment