Pages

23 November, 2010

చుండ్రుకు చెక్ పెట్టే "హెడ్ మసాజ్"

  • చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా అప్లై చేయాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా చూడాలి. అరగంట అలాగే ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
  • గోరువెచ్చని నూనెతో రాత్రిళ్లు హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపొడిని కలిపి తలకు బాగా అప్లై చేసి ఆరాక తలస్నానం చేస్తే చుండ్రుకు గుడ్‌బై చెప్పవచ్చు. వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు.
  • హెడ్ మసాజ్ చేయటంవల్ల ఉపయోగాలేంటంటే.. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తప్రసరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది.

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel