Pages

26 February, 2011

విజయం, లక్ష్యం, గమ్యం కోసం మన జీవన విధానం సరళం గా ఉంటే చాలు..., కఠినం గా కాదు.


జీవితం పట్ల ఆశావహ దృక్పధం కలిగి ఉన్న మానవునికి  ఎంతటి లక్ష్య మైన కఠినం గా ఉండదు.  అటువంటి దృక్పధాన్ని అలవరించేకుందుకు ఉపకరించే  సూత్రాలు మీ కోసం...
 
1. మీకు చేతనైన రీతిలో అభినందించడం ప్రారంభించండి.
...మీ ప్రశంసలు అందుకునే వాటిలో మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం, పార్కులో ఆడుకునే పిల్లలు, మీకు నచ్చిన భోజనంతో పాటు మీ సహచరుల, ఇతరుల గెలుపును... అభినందించండి... ఆస్వాదించండి. 
 
2.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి.
...ఇతరులతో పోల్చుకుని, వారిని అందుకునే ప్రయత్నంలో మీరు  తపన, ఆరాటం, ఒత్తిడి కు లొంగనవసరం లేదు...

3. సందర్భాన్ని అనుసరించి స్పందించండి.
... సందర్భాన్ని అనుసరించి ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయాధికారం మీదిగా చేసుకోండి.

4. మీ అంతట మీరుగా తెలుసుకోండి.
ఏదైనా విషయాన్ని మీ అంతట మీరుగా తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం వలన ఆశావహ జీవితాన్ని గడపవచ్చు.

5. చర్యకు ప్రతిచర్య.
... మీకు నచ్చని వాతావరణంలో నచ్చినట్లుగా నటించకండి.

6. ప్రస్తుతంలో జీవించండి.
అవసరానికి మించి గతకాలపు మరియు భవిష్యత్తుకు చెందిన ఆలోచనలలో ఊగిసలాడకండి

7. మానసికంగా సిద్ధం కండి.
అరుదైన, గొప్పదైన సందర్భాలలో మీ భావవ్యక్తీకరణ, వ్యవహార శైలి, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే తీరులో మీదైన శైలిని అలవరించుకుని చిరునవ్వును ఆభరణంగా ధరించండి.

8. అపజయాన్ని ఆహ్వానించండి.
గొప్పవారి జీవితాలలోకి అనేక అపజయాల తరువాతనే విజయం అడుగు పెట్టిందని గుర్తుంచుకోండి. పొందిన విజయంతో సంతృప్తి చెందక ఇతర అవకాశాల అందుకునే క్రమంలో అపజయాలు పునరావృతమైనా వారు వెనుకంజ వేయరు. కనుక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. విజయం మీ తలుపు తట్టక మానదు.

9. కోరుకున్న వాటిపై దృష్టిని కేంద్రీకరించండి.
నూతన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేందుకు అనేకమంది కొత్త వ్యక్తులను కలవడం ప్రారంభించండి. తద్వారా గొప్ప బాంధవ్యాలను ఏర్పరుచుకుని మీ జీవితంలో ఒంటరితనాన్ని పారద్రోలండి

10. ఇతరులకు సహాయం చేయండి.
ఇతరులకు సహాయం చేయడం ద్వారా అద్భుతమైన మానసిక అనుభూతిని సొంతం చేసుకోండి.

11. ఆలోచనలను నమోదు చేయండి.
ఆలోచనల చిట్టాను వ్రాయడం ప్రారంభించండి. ఆ చిట్టాలో అత్యధిక అంశాలు మీలో ఆశావహ దృక్పధాన్ని పెంచే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.తద్వారా మీ జీవితంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టండి.

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel