Pages

10 September, 2011

మారిన ప్రజల ధోరణే... నేతల తెగింపు కు కారణం

                 పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అప్పటి ప్రజల ఆలోచనాపరిధి ఎక్కువగా ఉండేది. తన భార్యా పిల్లలని కాక ఉమ్మడి కుటుంబం లోని ఇతర సభ్యుల బాగోగుల గూర్చి పట్టించుకునేవారు. అలాగే, అలా వారి ఆలోచన, విశాల ధృక్పధం దేశం, సమాజం వరకు కూడా విస్తరించి ఉండడం వలన అప్పట్లో ఎవరైనా నాయకుడు గాని, అధికారి గాని అవినీతిపరుడని, అక్రమార్జనకు పాల్పడ్డాడని వెల్లడైతే, ఆయా నాయకుడు లేదా అధికారి సమాజం లో తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేదికాదు. ఆయా నాయకులు తదుపరి ఎన్నికలలో ఓటమి పాలయ్యేవారు. 
                కానీ నేటి సంకుచిత మనస్తత్వం కలిగి ఉండే చిన్నకుటుంబవ్యవస్థ వల్ల ప్రజల ఆలోచనాపరిధి కూడా కుచించుకుపోయి సమాజం పై, దేశం పై కూడా చెడు ప్రభావం చూపుతోంది. తమ భార్యా పిల్లల గూర్చి మాత్రమే ఆలోచించే చిన్న కుటుంబవ్యవస్థ లోని ప్రజలు దేశానికి నష్టం కలిగించే నాయకుల అవినీతి, అక్రమార్జన గూర్చి ఏ మాత్రం ఆలోచించకపోగా, వారి వల్ల తమకు జరిగిన చిన్నపాటి మేలు వలన వారికి విశ్వాసం చూపడానికి సిద్ధపడుతున్నారు. ప్రజల యొక్క ఈ ధోరణి వలన ఆయా నాయకులు మరింత తెగబడే ధోరణి ప్రదర్శిస్తున్నారు.
          అసలు ప్రజలకు సేవ చేయడమనేది, ప్రజలు ఎన్నుకున్న నాయకుల యొక్క, ప్రభుత్వం యొక్క భాద్యత. ఇక్కడ విశ్వాసం అనే భావనను ప్రజలు వీడి, ప్రజల సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని స్వలాభం కు అధిక ప్రాధాన్యతనిచ్చే నాయకులకు తగిన బుద్ధిచెప్పాలి. 

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel