Pages

27 August, 2011

బాత్రూమోపాఖ్యానం: విశాలం గా ఉండాల్సింది మన ఇల్లు, మనసు మాత్రమే కాదు... Bathroom కూడా...

             మనలో చాలామంది వ్యక్తిత్వవికాసం ద్వారా మనసులను విశాలం చేసుకుంటాం, ఇంటీరియర్ కు ప్రాధాన్యమిచ్చి ఇంటిని అందంగా, విశాలంగా ఉండేలా చూసుకుంటాం. కానీ, అదేంటో బాత్ రూం విషయం లో మాత్రం నిర్లక్ష్యం గా ఉంటాం. చాలామంది ఇళ్ళల్లో బాత్ రూం శుభ్రం గా లేకుండా ఉండటం, సరిగా నీళ్ళు కొట్టక కంపు కొడుతూ ఉండటం, అదీ చాలా ఇరుకుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఇరుకు బాత్ రూం లలో హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం వలన శరీరం సరిగా రిలాక్స్ కాదు. స్నానం చేసిన తాజా అనుభూతి మనకు లభించదు. పైగా ఇరుకు బాత్ రూం లు ఉక్కబోతగా కూడా ఉంటాయి, సరైన వెంటిలేషన్ లేకుండా. 
       
              అందుకే బాత్ రూం విశాలంగా, నీళ్ళు సరిగా కొట్టడం ద్వారా పరిశుభ్రం గా, వాసన రాకుండా చూసుకోవాలి. అసలు బాత్ రూం అనేది బెడ్ రూం లో సగం ఉండాలి, వెంటిలేషన్ బాగుండాలి అని అంటాను నేను. చాలామంది బాత్ రూం లో సువాసనల కోసం కొన్ని బాత్ రూం పెర్ఫ్యూమ్స్ వాడతారు. అసలు పైన పేర్కొన్నట్లు బాత్ రూం పరిశుభ్రంగా ఉంటే వేరే పెర్ఫ్యూమ్స్ అవసరం ఉండదు, మనం వాడే సబ్బు, షాంపూల వాసనలు సరిపోతాయి. ఇలా ఉంటే మనం కొంచెం ఎక్కువసేపు బాత్ రూం లో గడుపుతూ స్నానం చేయడం వలన మనం తాజాదనం ఫీల్ పొందవచ్చు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

              నేనేమీ మిమ్మల్నిపేలస్ కట్టమనడం లేదు, మీరు ఇల్లు కట్టుకుంటే బెడ్ రూం లో సగం బాత్ రూం ఉండేలా చూసుకోండి... అని అంటున్నా..., అంతే. 
               సరే..., ఇంటి బాత్ రూం గూర్చి ఇంత చెప్పాల్సి వచ్చింది, పబ్లిక్ toilets గూర్చి ఇంకెంత చెప్పాలో..., నా వల్ల కాదు... నే చెప్పలేను.

1 comment:

Trend N track

Trend N track
YouTube Channel