Pages

24 February, 2011

ఆఫీసు మీటింగ్ కు వెళ్ళాలా..., అయితే...


ఆఫీసు మీటింగులు ఎంతో ముఖ్యమైనవి. మీరు ఆఫీసు మీటింగులో ఈ క్రింద తెలిపినవి పాటిస్తున్నారా...,

  • మీటింగులకు ఆలస్యంగా వెళ్లకండి. సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధపరచుకోకుండా వెళ్లకండి. దానివల్ల అభాసుపాలవుతారు. ముందుగా మీ సీనియర్లను మాట్లాడనివ్వండి. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోకండి. మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడే నోరు మెదపండి.
  •  ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడకండి. దానివల్ల అనవసరపు వాగ్వాదాలు చెలరేగుతాయి. వక్రభాష్యాలు వద్దు. అవతలివారి మాటలను శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వారిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉండదు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా, స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడండి.
  •  భయకంపితులు కాకండి. దురదృష్టవశాత్తూ కొందరు ఉద్యోగులకు సమావేశాలకంటే రణక్షేత్రాలే. మీరు బాధితులైనట్లైతే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని భయపడిపోకండి
  •  సమావేశంలో చూయింగ్ గమ్ నములుతూ కూర్చోకండి. ఇది అవతలివారికి మీపట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. అమర్యాదకరమైనది. సెల్‌ఫోన్‌ని స్విచాఫ్ చేయండి. సమావేశసమయంలో మీ సెల్ మోగుతున్నట్లయితే అది సమావేశానికి భంగం కలిగిస్తుంది. మాట్లాడటం అసలే కూడదు.
  •  సమావేశపు ఎజెండాను హైజాక్ చేయకండి. మీరూ, మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు ప్రధానంగా ఏ విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉందో అవి పక్కదోవ పట్టకుండా చూస్తుండండి. సమావేశానికి గైర్హాజరు కాకండి. ఇది చాలా హేయమైన చర్య అవుతుంది. మీపై అధికారులు దానిని సీరియస్‌గా తీసుకోవచ్చు కూడా.

1 comment:

Trend N track

Trend N track
YouTube Channel