Pages

26 February, 2011

విజయం, లక్ష్యం, గమ్యం కోసం మన జీవన విధానం సరళం గా ఉంటే చాలు..., కఠినం గా కాదు.


జీవితం పట్ల ఆశావహ దృక్పధం కలిగి ఉన్న మానవునికి  ఎంతటి లక్ష్య మైన కఠినం గా ఉండదు.  అటువంటి దృక్పధాన్ని అలవరించేకుందుకు ఉపకరించే  సూత్రాలు మీ కోసం...
 
1. మీకు చేతనైన రీతిలో అభినందించడం ప్రారంభించండి.
...మీ ప్రశంసలు అందుకునే వాటిలో మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం, పార్కులో ఆడుకునే పిల్లలు, మీకు నచ్చిన భోజనంతో పాటు మీ సహచరుల, ఇతరుల గెలుపును... అభినందించండి... ఆస్వాదించండి. 
 
2.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి.
...ఇతరులతో పోల్చుకుని, వారిని అందుకునే ప్రయత్నంలో మీరు  తపన, ఆరాటం, ఒత్తిడి కు లొంగనవసరం లేదు...

3. సందర్భాన్ని అనుసరించి స్పందించండి.
... సందర్భాన్ని అనుసరించి ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయాధికారం మీదిగా చేసుకోండి.

4. మీ అంతట మీరుగా తెలుసుకోండి.
ఏదైనా విషయాన్ని మీ అంతట మీరుగా తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం వలన ఆశావహ జీవితాన్ని గడపవచ్చు.

5. చర్యకు ప్రతిచర్య.
... మీకు నచ్చని వాతావరణంలో నచ్చినట్లుగా నటించకండి.

6. ప్రస్తుతంలో జీవించండి.
అవసరానికి మించి గతకాలపు మరియు భవిష్యత్తుకు చెందిన ఆలోచనలలో ఊగిసలాడకండి

7. మానసికంగా సిద్ధం కండి.
అరుదైన, గొప్పదైన సందర్భాలలో మీ భావవ్యక్తీకరణ, వ్యవహార శైలి, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే తీరులో మీదైన శైలిని అలవరించుకుని చిరునవ్వును ఆభరణంగా ధరించండి.

8. అపజయాన్ని ఆహ్వానించండి.
గొప్పవారి జీవితాలలోకి అనేక అపజయాల తరువాతనే విజయం అడుగు పెట్టిందని గుర్తుంచుకోండి. పొందిన విజయంతో సంతృప్తి చెందక ఇతర అవకాశాల అందుకునే క్రమంలో అపజయాలు పునరావృతమైనా వారు వెనుకంజ వేయరు. కనుక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. విజయం మీ తలుపు తట్టక మానదు.

9. కోరుకున్న వాటిపై దృష్టిని కేంద్రీకరించండి.
నూతన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేందుకు అనేకమంది కొత్త వ్యక్తులను కలవడం ప్రారంభించండి. తద్వారా గొప్ప బాంధవ్యాలను ఏర్పరుచుకుని మీ జీవితంలో ఒంటరితనాన్ని పారద్రోలండి

10. ఇతరులకు సహాయం చేయండి.
ఇతరులకు సహాయం చేయడం ద్వారా అద్భుతమైన మానసిక అనుభూతిని సొంతం చేసుకోండి.

11. ఆలోచనలను నమోదు చేయండి.
ఆలోచనల చిట్టాను వ్రాయడం ప్రారంభించండి. ఆ చిట్టాలో అత్యధిక అంశాలు మీలో ఆశావహ దృక్పధాన్ని పెంచే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.తద్వారా మీ జీవితంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టండి.

24 February, 2011

ఆఫీసు మీటింగ్ కు వెళ్ళాలా..., అయితే...


ఆఫీసు మీటింగులు ఎంతో ముఖ్యమైనవి. మీరు ఆఫీసు మీటింగులో ఈ క్రింద తెలిపినవి పాటిస్తున్నారా...,

  • మీటింగులకు ఆలస్యంగా వెళ్లకండి. సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధపరచుకోకుండా వెళ్లకండి. దానివల్ల అభాసుపాలవుతారు. ముందుగా మీ సీనియర్లను మాట్లాడనివ్వండి. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోకండి. మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడే నోరు మెదపండి.
  •  ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడకండి. దానివల్ల అనవసరపు వాగ్వాదాలు చెలరేగుతాయి. వక్రభాష్యాలు వద్దు. అవతలివారి మాటలను శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వారిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉండదు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా, స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడండి.
  •  భయకంపితులు కాకండి. దురదృష్టవశాత్తూ కొందరు ఉద్యోగులకు సమావేశాలకంటే రణక్షేత్రాలే. మీరు బాధితులైనట్లైతే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని భయపడిపోకండి
  •  సమావేశంలో చూయింగ్ గమ్ నములుతూ కూర్చోకండి. ఇది అవతలివారికి మీపట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. అమర్యాదకరమైనది. సెల్‌ఫోన్‌ని స్విచాఫ్ చేయండి. సమావేశసమయంలో మీ సెల్ మోగుతున్నట్లయితే అది సమావేశానికి భంగం కలిగిస్తుంది. మాట్లాడటం అసలే కూడదు.
  •  సమావేశపు ఎజెండాను హైజాక్ చేయకండి. మీరూ, మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు ప్రధానంగా ఏ విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉందో అవి పక్కదోవ పట్టకుండా చూస్తుండండి. సమావేశానికి గైర్హాజరు కాకండి. ఇది చాలా హేయమైన చర్య అవుతుంది. మీపై అధికారులు దానిని సీరియస్‌గా తీసుకోవచ్చు కూడా.

19 February, 2011

పడుకుందామా...?


ఒక రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలంటారు వైద్య నిపుణులు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కవైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో వెల్లడించారు. అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలోని 30,000 మంది పెద్దవారిపై 2005లో వారు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు యాంగినా (శ్వాస ఆడకపోవటం) వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే.. వయస్సు, స్త్రీ, పురుషులు, పొగ తాగేవారు, మద్యపాన ప్రియులు, బక్కపలచనివారు, ఊబకాయులు ఇలా అందరి విషయాల్లోనూ ఈ ఫలితాల ఒకే రకంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
 
నిద్ర వల్ల మరో పెద్ద సమస్య ఏంటంటే "నిద్రలేమి" దీనిని వైద్య పరిభాషలో "ఇస్నోమనియా" అంటారు. ఈ నిద్రలేమి కారణంగా అలసట, కలవరపాటు, అవిశ్రాంతత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ నిద్రలేమిని అధిగమించిటానికి కొన్ని చిట్కాలు మీకోసం...
  • నిద్ర విషయంలో ఒక నిర్ధిష్ట సమయాన్ని కేటాయించుకోండి. ప్రతి రోజు అదే సమయానికి నిద్రపోండి. అలాగే నిద్ర మెలకువకు కూడా సమయాన్ని పాటించండి. ఇలా చేయడం వల్ల మీ మనస్సు, శరీరం మీ నిద్ర విషయంలో క్రమబద్దీకరించబడతాయి.
  •  నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా స్నాక్ ఫుడ్ తీసుకోండి. అలాగని ఎక్కువ కారంగా ఉండే పదార్ధాలను కానీ, మిఠాయిలను కానీ తీసుకోకండి. సీరియల్స్ లేదా కొన్ని బ్రెడ్ ముక్కలు తీసుకున్నట్లయితే, ఇవి జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మామూలుగా కొంత మంది తిన్న ఆహారం జీర్ణంకాక పోయినా నిద్ర సమస్య తలెత్తుతుంది. అలాంటి వారు ఇలా స్నాక్‌ ఫుడ్ తీసుకోడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయ్యి ప్రశాంతమైన నిద్రను పొందుతారు.
  • నికోటిన్‌కు దూరంగా ఉండండి.... లేదా నిద్రకు ఉపక్రమించే 5-6 గంటలకు ముందు వరకూ ఎటువంటి నికోటిన్ పదార్ధాలను సేవించకండి.
  • చాలా మంది నిద్రకు ముందు ఆల్కహాల్ (మద్యం) సేవిస్తారు, పైగా ఇలా సేవంచండం వల్ల సుఖమైన నిద్రను పొందవచ్చనేది వారి అభిప్రాయం కూడా... నిజానికి ఇది పెద్ద అవాస్తం. అంతే కాకుండా దీని వల్ల వేరే సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. సాధారణంగా నిద్రకు ముందు మద్యం సేవిస్తే నిద్ర మధ్యలో చికాకులు కలుగుతాయి. కావున నిద్రకు ఉపక్రమించే 5-6 గంటలకు ముందు వరకూ మద్యాన్ని సేవించకండి.
  • నిద్ర పోవటాని ముందు పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి నిద్రను పొందుతారు. కానీ ఆకలితో మాత్రం ఎప్పుడూ పడుకోకండి.
  • పడక గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పడక గదిలో మంచి గాలి వచ్చేలా వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకోండి. ఎటువంటి శబ్దాలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడండి. అవసరమైతే ఇయర్‌ప్లగ్‌లను కానీ, దూదిని కాని ఉపయోగించండి.
  • చివరిగా... ఎలాంటి ఆలోచనలు పెట్టకోకుండా బాగా కాళ్లు చాచుకొని ప్రశాంతంగా నిద్రపోండి. సోఫాలు, కుర్చీలలో ఇబ్బందిగా పడుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదని గమనించండి.

11 February, 2011

'ఒత్తిడి' - The Stress ...ను జయిద్దాం... ఇలా...


'ఒత్తిడి' - The Stress ...ను జయిద్దాం... ఇలా...   

ఈ ఒత్తిడిని నివారించుకునేందుకు మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా నివారించుకునే విధానాలను గూర్చి ఒకసారి తెలుసుకుందాం...

సుధీర్ఘ శ్వాస - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది. 
వ్యాయామం - వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు, ఆరోగ్యం, చక్కని శరీరాకృతి లభిస్తాయి. 
ఆరోగ్యకరమైన ఆహారం - సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. అధిక ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. 
నిద్ర - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అటు ఎక్కువగా.. ఇటు తక్కువగా కాకుండా.. రోజుకు ఎనిమిది గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది. నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే.. ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.
రిలాక్స్ - మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం, స్నేహితులను కలుసుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి.

10 February, 2011

మన శరీరం లో కొలెస్టరాల్ ను తగ్గించే కొన్ని పదార్థాలు...


పుట్టగొడుగులు: కొలెస్టరాల్ నిల్వలు తగ్గించడంలో పుట్టగొడుగుల్లోని బి, సి, క్యాల్షియం విటమిన్లతోపాటు ఇతర మినరల్స్ బాగా పనిచేస్తాయి.  
ఓట్ మీల్: దీనిలోని బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పాంజివలే పనిచేసి కొలెస్టరాల్ ను గ్రహిస్తుంది.  
ద్రాక్ష: ద్రాక్షలోని ముఖ్యమైన అంతోసైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్టరాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాసియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం. 
క్యారెట్: కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో క్యారెట్లోని బీటాకెరొటీన్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి.  
మిరియాలు: నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది.

Trend N track

Trend N track
YouTube Channel