Pages

17 November, 2010

లావెండర్ బాత్ చేస్తే మృదువైన చర్మం.


లావెండర్ నూనె కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. చర్మం తెగినపుడు, కాలినపుడు, కొత్తచర్మం తొందరగా తయారయ్యేలా చేయడం ద్వారా లావెండర్ వాటిని త్వరగా మానేలా చేస్తుంది. గాయాలను నయం చేస్తుంది.లావెండర్ నూనెను శరీరంపై నేరుగా ఉపయోగించవచ్చు. మరొక నూనెలో కలుపుకోనవసరం లేదు. లావెండర్ కలిపిన సబ్బులు చర్మంపై మృదువుగా పనిచేస్తాయి. అందువల్ల సెన్సివిటివ్ స్కిన్స్ గలవారు కూడా ఈ లావెండర్ ను ఉపయోగించవచ్చు.చర్మ కణాలు ఆరోగ్యంగా ఎదిగేలా సహకరిస్తుంది. కీటకాలు కుట్టినపుడు బాధనుంచి రిలీఫ్‌నిస్తుంది. దోమలు, కీటకాలను పారద్రోలే రిపెల్లెంట్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతుంది. షవర్ బాత్, జెల్స్‌లో లావెండర్‌ను వాడతారు.
                  లావెండర్ నూనె కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే మేని ఛాయ వెలుగులు విరజిమ్ముతుంది. ఈ లావెండర్ బాత్కు ఏయే పదార్థాలు కావాలి... వేటిని ఉపయోగించాలో చూద్దాం.


లావెండర్ బాత్ 
సాల్ట్ తయారీకి కావలసినవి: 
సాల్ట్ 4 టేబుల్ స్పూన్స్, లావెండర్ ఆయిల్ 18 చుక్కలు
తయారు చేసే విధానం: ఈ రెంటినీ కలిపి ఒక బాటిల్‌లో నిల్వ ఉంచాలి. రెండు చక్కలు స్నానం చేసే నీటికి కలిపితే చాలు. ఆనందకరమైన స్నానం మీ సొంతమవుతుంది.


లావెండర్ ఆరెంజ్ బాత్ 
సాల్ట్‌కు కావలసినవి:
4 టేబుల్ స్పూన్స్ సీ సాల్ట్
10 చుక్కలు లావెండర్ ఆయిల్
8 చుక్కలు ఆరంజ్ ఆయిల్
తయారు చేసే విధానం: ఈ పదార్థాల్ని బాగా మిక్స్ చేయాలి. బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఒకటి, రెండు ముక్కలు నీటికి కలిపి దానితో స్నానం చేయాలి.

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel