రక్తపోటు నివారణకు డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో "ఫ్లావనాల్స్" అనే పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
బీపీ పోయి షుగర్ రాదు కదా???
ReplyDeletemari oka vela rakta potutho paatu diabetes kuda unte. appudu kuda tinochha.. koncham cheppandi
ReplyDeleteregards,
aditya