Pages

08 January, 2012

మహేష్ బాబు 'మీసకట్టు'...


                  మహేష్ బాబు మీసకట్టు తో కృష్ణ గారిలా కనపడితే బాగుంటుందని ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం. దానికి తగ్గ కొన్ని సీన్లను తన సినిమా లలో క్రియేట్ చెయ్యొచ్చు. కొన్ని సందర్భాలలో విలన్ లను, హీరోయిన్ ను ఏడిపించడానికి  మహేష్ బాబు కామెడీగా లేని ఒక అన్న పాత్రను సృష్టించి ఒక పెట్టుడు మీసం దగ్గర ఉంచుకుని, అవసరమైనపుడు అన్న పాత్ర గా ఎంటర్ అవడం అన్న మాట. అన్న పాత్ర కోసం కృష్ణ ను ఇమిటేట్ చేస్తే సరి...., ఆ పెట్టుడు మీసం తో. 
                  హీరోయిన్ ఉన్న సందర్భం లో తమ్ముడి పాత్ర విలన్ల తో ఫైట్ చేస్తూ చేతికి గాయమైతే, హీరోయిన్ తన చున్నీ చింపి చేతికి కట్టు కడితే, కాసేపటికి తమ్ముడు కనుమరుగై అన్న గెటప్ లో వస్తే ( చేతి కట్టు తో), ఆ చేతి కట్టు ను హీరోయిన్ గుర్తించడం... ఏంటీ..., మీకు 'ఇంద్రుడు చంద్రుడు' లో కమల్ హాసన్, విజయ శాంతి సీను గుర్తువస్తుందా..., ఆ... లేకపోతే..., అప్పనంగా సీన్లు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు...

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel