ఒక విమానం లో ఒక పొలిటీషియనూ, ఒక బడి పంతులు, ఒక విద్యార్ధి, వీరు ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో విమానం ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ప్రమాదం లో చిక్కుకుంది. అపుడు పైలట్లు వారి పేరాచూట్లు తగిలించుకుని, విమానం లోంచి దూకబోతూ, విమానం కాసేపట్లో కూలిపోబోతున్నదనీ, విమానం లో ఇంకా రెండు పేరాచూట్లు మాత్రమే ఉన్నాయి, కానీ మీరు ముగ్గురున్నారని హెచ్చరించి, వారు దూకేసారు.
ఇహ అప్పుడు పొలిటీషియన్ మిగిలిన ఇద్దరితో, తాను ఈ దేశం కోసం, ప్రజల కోసం చేయవలసినది చాలా ఉందని, ఈ దేశానికి తన అవసరం చాలా ఉందని చెప్పి ఒక పేరాచూట్ తీసుకుని విమాన లోంచి దూకేసాడు.
ఇక మిగిలినది ఒక పేరాచూట్ మాత్రమే. అప్పుడు ఆ బడి పంతులు తన శిష్యుని తో, తాను రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నానని, ముసలివాడిని అయిపోతున్నానని, తాను ఇక బతికి సాధించాల్సింది ఏమీ లేదని, నీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది, బోలెడు జీవితం ఉంది, కాబట్టి మిగిలిన ఒక పేరాచూట్ నువ్వు తగిలించుకుని దూకెయ్యి నాయనా... అని చెప్పాడు.
అపుడా శిష్యుడు చిన్న నవ్వు నవ్వి, మాష్టారూ..., మీకూ పేరాచూట్ ఉంది, నాకూ పేరాచూట్ ఉంది, రండి, తగిలించుకుని దూకెయ్యండి అన్నాడు. అపుడా బడి పంతులు బోలెడు ఆశ్చర్యపడి, ఇంకో పేరాచూట్ ఎక్కడిది? అని అడిగాడా శిష్యుడిని. దానికా శిష్యుడు నవ్వి, మాష్టారూ..., ఇందాక ఆ రాజకీయ నాయకుడు విమానం లోంచి దూకబోతూ, పేరాచూట్ అని అనుకుని నా స్కూల్ బాగ్ తగిలించుకుని దూకేసాడూ... అని అన్నాడు.
Excellent Joke, We have to send our politicians like this
ReplyDelete