Pages

14 October, 2010

కంప్యూటర్‌తో పనిచేస్తున్నారా...ఆరోగ్య రహస్యాలు!!


నేటి యుగంలో పలు కంపెనీలు, కార్యాలయాలలో కంప్యూటర్‌తోనే ఎక్కువగా పని చేయాల్సి వస్తోంది. నిత్యం కంప్యూటర్‌తో పని చేయడం వలన కళ్ళతోపాటు మెదడు అలసటకు గురవుతుంటాయి. అలసట, ఒత్తిడిని దూరం చేసేందుకు కొన్ని చిట్కాలను ప్రయోగించండి. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* మీరు కంప్యూటర్‌తో పనిచేసే సమయంలో చుట్టుపక్కల చక్కటి వాతావరణం ఉండాలి.
* మీరు కూర్చున్న కుర్చీ మీకు అనుకూలంగా ఉండాలి. అందునా అడ్జెస్టబుల్‌గా ఉంటే మరీ మంచిది.
* నిరంతరం కంప్యూటర్‌తో పనిచేసేవారైతే ప్రతి 40 నిమిషాల తర్వాత కీబోర్డ్, మానిటర్‌ నుంచి కాస్త విశ్రాంతి (బ్రేక్) తీసుకోండి. విశ్రాంతి తీసుకునే సమయంలో కళ్ళను సుదూరంగానున్న చిత్రాలు లేదా ఏదైనా ప్రకృతి రమణీయత ఉట్టిపడే బొమ్మలు, చెట్లను చూడండి. దీంతో కళ్ళకు ఉపశమనం కలుగుతుంది.
* మీరు ఉపయోగించే కంప్యూటర్ యొక్క మానిటర్ ఎత్తు మీ కళ్ళకు సమానంగా ఉండేలా చూసుకోండి.

* మీ మో చేతుల కింద సపోర్ట్ ఉండేలా చూసుకోండి. దీంతో మీ చేతులకు అలసట ఉండదు.
* కంప్యూటర్ ముందు అడ్జస్టబుల్ టేబుల్ ల్యాంప్ ఉండేలా చూసుకోండి. దీంతో బల్బు కాంతి ప్రకాశవంతంగా ఉండి, మీ కళ్ళకు ఒత్తిడిని తగ్గిస్తుంది.
* మీరు కంప్యూటర్ ముందు కూర్చుని కీబోర్డ్‌తో పని చేసే సమయంలో చేతులు చక్కగా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ చేతులకు కీబోర్డ్‌కు 70-90 డిగ్రీల కోణంలో ఉండేలా సరిచేసుకోండి.
* మీరు కూర్చున్న స్థానంలో ఎలక్ట్రిక్ వైర్లు కాళ్ళకు దగ్గరలో ఉంచకండి.
* కంప్యూటర్ ముందు మీరు కూర్చునే తీరు, కుర్చీ, కంప్యూటర్ స్క్రీన్ సరైన కోణంలోనే ఉంటే వీపు నొప్పి, ఇతర ఇబ్బందులు తలెత్తవంటున్నారు వైద్య నిపుణులు. 


3 comments:

  1. కంప్యూటర్ ముందు మీరు కూర్చునే తీరు, కుర్చీ, కంప్యూటర్ స్క్రీన్ సరైన కోణంలోనే ఉంటే వీపు నొప్పి, ఇతర ఇబ్బందులు తలెత్తవంటున్నారు వైద్య నిపుణులు.
    right point,otherwise one can suffer wth lumbago nd sacro-illiac stiffness disorders..sir

    ReplyDelete

Trend N track

Trend N track
YouTube Channel