Pages

04 September, 2013

ఉప్పుకప్పురంబు పేరడీ...

గురువు గారి గుండు గుండ్రముగ నుండు
తిప్పి తిప్పి చూడ సొట్టలుండు
సొట్ట లేనిచోట సుత్తిచ్చుక్కొ ట్టరా 
విశ్వదాభిరామ వినుర వేమ.

31 August, 2012

అవినీతి & Politicians... మారిన ప్రజల విచక్షణ...!!!, ...నైతికత...???



అవినీతి, అక్రమాలకూ పాల్పడి అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులకు గల ప్రజాదరణ చూస్తుంటే, ఉన్నత స్థాయిలో అవినీతి ప్రజలకు ఇంకా పట్టే వాతావరణం భారతదేశంలో ఏర్పడలేదని, అలాగే అవినీతి విషయంలో ప్రజలు అన్ని పార్టీలను ఒకే గాటన కట్టేస్తున్నారని తెలుస్తోంది. 
రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇక్కడే మరో విషయాన్ని కూడా గుర్తించాలి. నాయకుల అవినీతి కార్యకలాపాలు తక్షణమే ప్రజలపై ప్రభావం వేసే పరిస్థితి లేదు. దీర్ఘకాలంలో వాటి ప్రభావం ప్రజలపై సామూహిక ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే చూపుతున్నాయి కూడా. వాటిని గ్రహించే స్థితి కూడా ప్రజలకు లేదు. 
ఇక, ఉన్నత స్థాయిలో అవినీతి జరిగినప్పటికీ నిత్య జీవనంలో తక్షణ ప్రయోజనం కలగడాన్ని మాత్రమే ప్రజలు తమ అనుభవంలోకి తీసుకుంటున్నారు. పాలకులు లేదా రాజకీయ నాయకులు ఎంతగా అవినీతికి పాల్పడినా తమకు ఏ మేరకు మేలు జరుగుతుందనేది చూస్తున్నారు. అది కూడా తమ వ్యక్తిగత ప్రయోజనమై ఉండాలి.
అలాగే, 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడల వంటి కుంభకోణాల్లో కాంగ్రెస్ తమ పార్టీ వారిని కూడా సహించేదిలేదని, కళంకితులను కాంగ్రెసు సహించడానికి సిద్ధంగా లేదని ఎంతగా ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ కేసులు క్రమంగా నీరు కారుతాయనే అభిప్రాయమే ప్రజల్లో బలంగా ఉంది.

28 July, 2012

నవరంగ్ సమోసా@విజయవాడ ... కనెక్ట్ చేస్తుంది నన్ను విజయవాడ తో...


1990 లలో విజయవాడ లో చదువు వెలగబెట్టిన తరువాత విజయవాడ ను వీడాక, మధ్యమధ్యలో విజయవాడ విజిట్ చేసినపుడు, తిరిగి ఇంటికి  వచ్చాక మొదట్లో ఏదో అనీజీగా ఉండేది. అన్నేళ్ళు విజయవాడ లో ఉన్నాం కదా, సరిగా కనెక్ట్ కాలేక పోతున్నానేమిటి ఇపుడు విజయవాడ తో అని అనుకునేవాడిని. ఆలోచిస్తే ఒక విషయం తట్టింది.   ఇక మరోసారి విజయవాడ వెళ్ళినపుడు నవరంగ్ సమోసా తిన్నా..., అంతే... విజయవాడ తో కనెక్ట్ అయిపోయా. అంతే అప్పటినుండి విజయవాడ వెళ్ళిన ప్రతిసారీ నవరంగ్ సమోసా రుచి చూడ్డం, వీలైతే ఇంటికి పార్సిల్ తీసుకు వెళ్ళడం చేస్తున్నా. ఎందుకంటే..., ఆ చదువుకునే రోజుల్లో నవరంగ్ సమోసా తినడం నా దినచర్య లో భాగమైపోయింది మరి. ఒకోసారి... టిఫిన్ కు బదులు, భోజనానికి బదులు నవరంగ్ సమోసాలు తిని నవరంగ్ చాయ్ తాగి కడుపు నింపుకునేవాడిని. అంత ఇష్టం మరి. నవరంగ్ చాయ్ కూడా చిక్కగా, స్ట్రాంగ్ గా ఉండేది. నవరంగ్ సమోసా లో పుదీనా ఫ్లేవర్ కలిగి స్వీట్ బ్రెడ్ తో చేసిన హాట్ కర్రీ ఉంటుంది. అలాగే..., నవరంగ్ ధియేటర్ కూడా..., విజయవాడ లో ఎన్ని పెద్ద ధియేటర్లు ఉన్నా,  చూడ్డానికి పాతకాలం మేడ లా ఉన్నా..., నవరంగ్ థియేటర్ లో సినిమా చూసే అనుభూతే వేరు. కొత్త హాలివుడ్ మూవీసే గాక మా ముందు తరం సినిమాలైన క్లింట్ ఈస్ట్ వుడ్ కౌబాయ్, జేమ్స్ బాండ్, చార్లీ చాప్లిన్ సినిమాలన్నీ అక్కడే చూసాం. అప్పట్లో కేబుల్ టీవీ లేదు, మిగతా ధియేటర్ వాళ్ళు ఇలా పాత క్లాసిక్స్ వేసేవాళ్ళు కాదు. అలా..., నవరంగ్ ధియేటర్ ప్రత్యేకమైన అభిరుచి, ముద్ర కలిగి ఉండేది. నే మొదటసారి నవరంగ్ సమోసా రుచి చూసింది ఈ నవరంగ్ ధియేటర్ లోనే. అప్పటిదాకా నాకు సమోసా పై చిన్న చూపు ఉండేది, కూలీనాలీ తినేదని. దానికి తగ్గట్టు వాటి రుచి కూడా అలానే ఏడ్చేది..., మిగతా ఊళ్లలో. సినిమా కు వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ లో ఈ సమోసాలపై ఎగబడ్డం చూసి ఆశ్చర్యమేసింది నాకు. సరే..., ఏమిటో చూద్దాం దీని రుచి... అని అపుడు తిన్నా ఈ నవరంగ్ సమోసా. అది మొదలు ఇక.... సరే..., ఇదండీ..., విజయవాడ తో నా నవ'రంగా'నుబంధం.

02 May, 2012

ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు...

ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు బ్యాగ్ లు తగిలించుకుని స్కూలు కు  పోతుంటే, దారిలో ఒకచోట ఒక గేటు కు డా|| భయంకర్ ( Psychotherapist ) అని రాసి ఉంది. బోడిలింగానికి అర్ధం కాక  ఏకలింగాన్ని దాని అర్ధం చెప్పమన్నాడు. దానికి ఏకలింగం " ఒరేయ్...., మన ఇంగ్లీష్ పంతులు గారు ఏమని చెప్పారు..., పెద్ద పెద్ద వ్యాక్యాలు అర్ధం కాకపోతే, దానిని చిన్న చిన్న పదాలుగా విడగొట్టి చదవమని చెప్పారు కదా..., కాబట్టి నేను అలా చదువుతా చూడు..." అని ఇలా చదివాడు ఆ పేరుని " డా|| భయంకర్ ( Psycho... The Rapist )..."

Trend N track

Trend N track
YouTube Channel