Pages

Showing posts with label tomato. Show all posts
Showing posts with label tomato. Show all posts

31 October, 2010

టమోటాలు తినండి...ఆరోగ్యంగా ఉండండి!


టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎసిడిటీః టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.

మధుమేహ రోగులకుః మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కంటి జబ్బులకుః టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది.

బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. 


Trend N track

Trend N track
YouTube Channel