Pages

30 January, 2011

చిన్నగదుల్ని విశాలం చేసే "వెరైటీ బెడ్స్"


అసలే ఇరుకైన గదుల్లో బెడ్స్ వేస్తే మరింత ఇరుకవుతాయి. అలాగని చిన్నసైజు మంచాలు వేస్తే సరిపోవు. మరెలా...? అందుకనే, పెద్దసైజు బెడ్ వేసుకున్నా కూడా గది విశాలంగా ఉండేలా చేసే రకరకాల బెడ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 

మర్ఫీ బెడ్స్ : ఈ రకమైన బెడ్స్ ఎత్తినట్లయితే గోడలలోకి వెళ్లిపోతాయి. పగటిపూట ఈ బెడ్స్‌ను ఎత్తేసి, రాత్రిళ్లు ఎంచక్కా వాల్చుకుని బెడ్‌లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మర్ఫీ బెడ్స్ బుక్ ‌షెల్ప్, టీవీ, స్టీరియో స్టాండ్‌ల్లాగా కూడా లభ్యమవుతున్నాయి.

ట్రండిల్‌ బెడ్స్ : పిల్లలు కూడా మీతోపాటే పడుకునేటట్లయితే ట్రండిల్‌ బెడ్స్ అయితే మంచిది. ఈ రకం బెడ్స్‌లో ఒకదాని కింద మరో బెడ్‌ ఉంటుంది. రాత్రుళ్లు కింద బెడ్‌ను బయటకు లాగి వాడుకుని, పొద్దున్నే మళ్లీ లోపలికి నెట్టేయవచ్చు. అయితే పైనున్న బెడ్‌ కన్నా కింద బెడ్‌ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది. ఎత్తు కూడా కొంచెం కిందికే ఉంటుంది.

సోఫా కమ్‌ బెడ్స్ : సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్స్‌లో పిల్లలతో ఉండేవారికి ఈ సోఫా కమ్‌ బెడ్స్ బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా బెడ్‌రూమ్‌ లేకపోయినా... ఈ బెడ్‌ కొన్నట్లయితే అదే రాత్రుళ్లు పిల్లలకు బెడ్‌లా పనికివస్తుంది. పగటి పూట దాన్నే లివింగ్‌ రూమ్‌లో సోఫాలా వాడుకోవచ్చు. సోఫా కింద ఉండే స్థలంలో దుప్పట్లు, దిండ్లు, దిండు కవర్లు లాంటివి కూడా భద్రపరచుకోవచ్చు.

ఫ్యుటాన్స్ : తరచూ ట్రాన్స్‌ఫర్లు అయ్యేవారికి మంచాలను ఊడదీయడం, మళ్లీ బిగించడం పెద్ద తలనొప్పి. అలాంటి వారికోసం ఉపయోగపడేవి ఫ్యూటాన్స్ బెడ్స్. వీటిని అసరమైతే బెడ్‌లాగా వాడుకోవచ్చు. వద్దనుకుంటే, వాటిని చుట్టచుట్టి మెత్తటి సోఫాలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి సింగిల్, డబుల్ సైజుల్లో కూడా లభ్యమవుతున్నాయి.

బంక్‌ బెడ్స్ : పిల్లల గది చిన్నగా ఉందని బాధపడకుండా... ఎంచక్కా బంక్ బెడ్స్‌ను కొనేయండి. సింగ్ బెడ్ మీద ఇంకో బెడ్ ఉంటుంది. పైగా వీటిని పగటిపూట ఎత్తిపెట్టాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా ఈ బంక్ బెడ్స్‌ను బాగా ఇష్టపడతారు. సరే, వెంటనే కొనేద్దామా మరి...

No comments:

Post a Comment

Trend N track

Trend N track
YouTube Channel