ఇంకా ఈ రోజులలో స్త్రీ వాదం, స్త్రీ ఔన్నత్యం గూర్చి రాతలేంటి... ఈ రోజులలో ప్రతీ మొగుడూ పెళ్ళాన్నిఎంతో అపురూపం గా చూసుకుంటున్నాడు. పిల్లల ముడ్డి కడిగేదీ మొగుడే, మూతి కడిగేదీ మొగుడే, పెళ్ళానికి కడుపు వస్తే ఆఖర్న ఒకసారే ప్రసవవేదన పడుతుంది పెళ్ళాం. కానీ మొగుడు 9 నెలలూ ప్రసవవేదన పడతాడు. పూర్వం పెళ్ళి అయితే, ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలి వెళ్ళేది. కానీ ఇపుడు..., కొడుకు తల్లిదండ్రులను వదలి పెళ్ళాం కొంగుపట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఇక పెళ్ళాం కూడా సంపాదనాపరురాలైతే ఇహ చెప్పనేఅక్కర్లేదు పరిస్థితి. ఇలా మొగుడు తన అహాన్ని వదలి, పెళ్ళాం బాధ్యతలను స్వీకరించి బతికేస్తున్న ఈ రోజులలో ఇంకా స్త్రీ ఔన్నత్యం, స్త్రీ వాదం అంటూ ఈ రాతలేంటి...? అని చిరాకు వచ్చింది మొన్న ఒకచోట ఒక వ్యాసాన్ని చూసి.
ఈ సందర్భం లో పులిహోర అనే బ్లాగ్ లో అత్తగారి కామెంట్ ఒకటి గుర్తువచ్చింది... " మా అల్లుడు గారు మంచివాడు, మా అమ్మాయి ఎంత చెబితే అంత..., కానీ మా అబ్బాయి వెధవే, పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే రకం..." అని...