Pages

30 April, 2011

"ఓ పందోడో..." అంటే కొట్టేసాడు...

ఒక జోక్...
ఒక కార్పోరేట్ ఆఫీసు లో బాస్ తన ఆఫీసు బాయ్ ను "Open The Door ..." అని ఆజ్ఞాపిస్తే, కొత్తగా పనిలో జేరిన, పల్లె నుండి వచ్చిన, ఇంగ్లీష్ ను సరిగా అర్ధం చేసుకోలేని ఆ బాయ్ దానిని "ఓ పందోడో..." అని బాస్ తనను తిడుతున్నాడని భావించాడు, అంతే బాస్ ను కొట్టేసాడు.

19 April, 2011

ఇంకో విమానం జోక్...

             ఒక విమానం లో కొన్ని దేశాల ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా, విమానం కు ఏదో ప్రాబ్లం వచ్చిందని, నలుగురు ప్రయాణీకుల బరువును విమానం తగ్గించుకోవలసిన స్థితి లో విమానం ఉందని, పేరాచూట్లు లేవని కాబట్టి నలుగురు ప్రయాణీకులు ప్రాణత్యాగం చేయక తప్పదని పైలట్లు తేల్చి చెప్పారు. 
             అపుడు ఒక అమెరికన్ లేచి, విమానం లో ఉన్నతన దేశపు ప్రయాణీకుల ప్రాణాల కోసం తాను ప్రాణత్యాగం చేస్తున్నానని చెప్పి, విమానం లోంచి దూకేసాడు. ఇలాగే రష్యా తరపున ఒకడు, ఇంగ్లాండ్ తరపున ఒకడు విమానం లోంచి దూకేశారు. 
             ఇపుడు ఇండియా వంతు వచ్చింది. ఒక ఇండియన్ లేచి, తన దేశపు ప్రయాణీకుల ప్రాణాల కోసం, నేను పక్కనున్న పాకిస్తాన్ వాడి ప్రాణాలు త్యాగం చేస్తున్నాను, అని చెప్పితన పక్కనున్న పాకిస్తాన్ వాడిని విమానం లోంచి తోసేసాడు.

15 April, 2011

ఒక విమానం, ఒక పొలిటీషియనూ, ఒక మాష్టారు, ఒక స్టూడెంట్, ఒక పేరాచూట్, ... కాదు... కాదు, రెండు పేరాచూట్లు...

               ఒక విమానం లో ఒక పొలిటీషియనూ, ఒక బడి పంతులు, ఒక విద్యార్ధి, వీరు ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో విమానం ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ప్రమాదం లో చిక్కుకుంది. అపుడు పైలట్లు వారి పేరాచూట్లు తగిలించుకుని, విమానం లోంచి దూకబోతూ, విమానం కాసేపట్లో కూలిపోబోతున్నదనీ, విమానం లో ఇంకా రెండు పేరాచూట్లు మాత్రమే ఉన్నాయి, కానీ మీరు ముగ్గురున్నారని హెచ్చరించి, వారు దూకేసారు. 
               ఇహ అప్పుడు పొలిటీషియన్ మిగిలిన ఇద్దరితో, తాను ఈ దేశం కోసం, ప్రజల కోసం చేయవలసినది చాలా ఉందని, ఈ దేశానికి తన అవసరం చాలా ఉందని చెప్పి ఒక పేరాచూట్ తీసుకుని విమాన లోంచి దూకేసాడు. 
                ఇక మిగిలినది ఒక పేరాచూట్ మాత్రమే. అప్పుడు ఆ బడి పంతులు తన శిష్యుని తో, తాను రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నానని, ముసలివాడిని అయిపోతున్నానని, తాను ఇక బతికి సాధించాల్సింది ఏమీ లేదని, నీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది, బోలెడు జీవితం ఉంది, కాబట్టి మిగిలిన ఒక పేరాచూట్ నువ్వు తగిలించుకుని దూకెయ్యి నాయనా... అని చెప్పాడు. 
                అపుడా శిష్యుడు చిన్న నవ్వు నవ్వి, మాష్టారూ..., మీకూ పేరాచూట్ ఉంది, నాకూ పేరాచూట్ ఉంది, రండి, తగిలించుకుని దూకెయ్యండి అన్నాడు. అపుడా బడి పంతులు బోలెడు ఆశ్చర్యపడి, ఇంకో పేరాచూట్ ఎక్కడిది?  అని అడిగాడా శిష్యుడిని. దానికా శిష్యుడు నవ్వి, మాష్టారూ..., ఇందాక ఆ రాజకీయ నాయకుడు విమానం లోంచి దూకబోతూ, పేరాచూట్ అని అనుకుని నా స్కూల్ బాగ్ తగిలించుకుని దూకేసాడూ... అని అన్నాడు.

13 April, 2011

నాకు IPL అంటే చిరాకు...

అన్ని దేశాలోళ్ళూ కలసిపోయి టీం లు గా విడిపోయి ఆడే ఆట, ఈ IPL క్రికెట్..., ఏంటో, నాకైతే థ్రిల్లింగ్ గా అనిపించట్లా..., ఏ టీం కు సపోర్ట్ ఉండాలో, ఏ టీం గెలవాలని కోరుకోవాలో తెలియని మ్యాచ్ లు చూడబుద్ది కావట్లా.  అయినా, ఆడేవాళ్ళ పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. ఒక బౌలర్ వికెట్ తీసుకుంటే, తాను మాత్రం థ్రిల్ ఫీల్ అవుతున్నాడు, అదీ తన దేశం కోసం ఆడేటంత  కాదు, అలానే మిగిలిన ఆటగాళ్ళు కూడా వివిధ దేశాలోళ్ళు కాబట్టి వాళ్ళు ఆ బౌలర్ ను అభినందించటం లో కూడా ఇదే విధమైన తేడా కనపడుతుంది. వికెట్ పడినపుడు దేశం కోసం ఆడేటప్పటి సంబరం కనపడదు. ఇహ బాటింగ్ విషయానికి వస్తే, బాట్స్ మాన్ వచ్చామా..., కొట్టామా..., వెళ్ళామా... అన్నట్టు ఉంటుంది. ఈ సరికే జనాలకు IPL మోజు తగ్గుతుందని అనుకున్నా, కానీ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఈ ఏడాది కి గడిచేట్టుంది.

Trend N track

Trend N track
YouTube Channel