02 May, 2012

ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు...

ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు బ్యాగ్ లు తగిలించుకుని స్కూలు కు  పోతుంటే, దారిలో ఒకచోట ఒక గేటు కు డా|| భయంకర్ ( Psychotherapist ) అని రాసి ఉంది. బోడిలింగానికి అర్ధం కాక  ఏకలింగాన్ని దాని అర్ధం చెప్పమన్నాడు. దానికి ఏకలింగం " ఒరేయ్...., మన ఇంగ్లీష్ పంతులు గారు ఏమని చెప్పారు..., పెద్ద పెద్ద వ్యాక్యాలు అర్ధం కాకపోతే, దానిని చిన్న చిన్న పదాలుగా విడగొట్టి చదవమని చెప్పారు కదా..., కాబట్టి నేను అలా చదువుతా చూడు..." అని ఇలా చదివాడు ఆ పేరుని " డా|| భయంకర్ ( Psycho... The Rapist )..."

22 April, 2012

One Can Watch Escorts...

ఎస్కార్ట్స్ షేర్ ధర 78 రూపాయల స్థాయిని సులువుగా దాటి, ముందుకు కదులుతోంది. ప్రస్తుతం 81.40 వద్ద ఉంది. కాబట్టి ఈ ఎస్కార్ట్స్ షేర్స్ కొని, 80 రూపాయల వద్ద స్టాప్ లాస్ ఉంచి, మొదటి టార్గెట్ 90, ఆ పైన రెండవ టార్గెట్ 100 కోసం వెయిట్ చేయవచ్చు.

16 April, 2012

"నాక్కొంచెం తిక్కుంది..., దానికో తొక్కొంది..."

"సారీ... లెక్కుంది..." ... కదా... OK... హిందీవోళ్ళు కధలు కోసం సౌత్ వంక చూస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం రివర్స్ లో వెళ్తున్నాడు. తీన్ మార్, గబ్బర్ సింగ్... ఇలా. అసలు పవన్ గూర్చి కొత్తగా చెప్పుకోనవసరం లేదు..., 'జానీ' సినిమా చూడ్డంతోనే పవన్ గూర్చి ఒక అంచనా వచ్చేసారు మెగాభిమానులు. అయినా చిరంజీవి మరొక్కసారి గుర్తు చేసాడు పవన్ విలక్షణ వ్యత్యాస వ్యక్తిత్వం గూర్చి గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో. ఈ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఇంకొంచెం విలక్షణం గా కనపడింది. చిరంజీవి పక్కన కొంచెం ఇబ్బంది గా కదులుతూ, అంత నవ్వాల్సిన అవసరం లేని చోట కొంచెం అతిగా నవ్వడం, అయినా దానిని దాచుకోడానికి ప్రయత్నించాడనుకోండి. ఇలా పవన్ ఫీలింగ్స్ చూస్తే... కొంత ఒత్తిడి లో ఉన్నట్టు, ఒక మంచి హిట్ అతనికి అవసరం అన్నట్టు అనిపించింది. ఇహ చిరంజీవి చరణ్ 'ఆరెంజ్' గూర్చి ప్రస్తావించి, మనకు నచ్చిన సినిమాలు కాదు చేయాల్సింది, ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేయాలి అని పరోక్షంగా పవన్ కు సూచించాడు. ( 'పంజా' ఆడియో ఫంక్షన్ లో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటానని పవన్ చెప్పినట్టు గుర్తు..., దానికి చిరంజీవి బదులేమో ఇది అని అనిపించింది నాకు... ) 
              అలాగే..., చిరంజీవి రాజకీయ పయనం పట్ల పవన్ అసహనం గా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యం లో, చిరంజీవి కొన్ని కామెంట్లు చేసాడు ఈ ఫంక్షన్ లో... "ప్రజాసేవ, సమాజ సేవ చేయడం ముఖ్యం అంటూ..., ఎక్కడ ఉండి చేస్తున్నాం అనేది కాదు, సమాజ సేవ చేసే అవకాశం వద్దకు మనమే వెళ్ళాలి..." అంటూ.

30 March, 2012

మాక్కావాలొక..., మన్మోహన్ "సింగం"... ప్రధానిగా..., OK ...Watch This Video...

మాక్కావాలొక ..., మన్మోహన్ "సింగం"... ప్రధానిగా..., OK ...Watch This Video...

25 March, 2012

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డం ఎవరిదంటే...

చిరంజీవి నిష్క్రమణతో తెలుగు ఇండస్ట్రీలో తేడా ఒకటి కొట్టోచ్చినట్టు కనబడుతోంది. అదే స్టార్ డం..., చిరంజీవి వరకు స్టార్ డం హీరోలు అనుభవించారు, కాని ప్రస్తుతం ఆ స్టార్ డం దర్శకులు అనుభవిస్తున్నారు. నిజానికి అసలు సినిమా అనేది దర్శకుని సృష్టి, సినిమా క్రెడిట్ అంతా దర్శకులుకే చెందుతుంది. కానీ NTR నుండి చిరంజీవి వరకు ఆ స్టార్ డం అనేది ఈ అగ్రహీరోలు దర్శకులుకు దక్కనీక తాము అనుభవించారు. ఆఖరకు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిరంజీవి సినిమాల క్రెడిట్ కూడా చిరంజీవికే దక్కింది. చిరంజీవి వంతుల వారీగా దర్శకులుకు అవకాశమిచ్చేవాడు. చిరంజీవితో సినిమా కోసం దర్శకులు, నిర్మాతలు పడిగాపులుపడేవారు. 

కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. చిరంజీవి నిష్క్రమించాక ఆ స్టార్ డం దర్శకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పూరీ జగన్నాద్, రాజమౌళి, శ్రీను వైట్ల వంటి దర్శకులు స్టార్ డం అనుభవిస్తున్నారు. ఇప్పటి యువహీరోలు తమకో బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వమని ఈ దర్శకులు వెంట పడుతున్నారు. ఇపుడీ దర్శకులు తో సినిమా కోసం ఈ యువహీరోలు, నిర్మాతలు పడిగాపులు పడుతున్నారు. 

ఉదాహరణకు, ఒక యువహీరో సినిమా ప్రారంభ ముహూర్తపు షాట్ కు..., పోటీగా భావిస్తున్న మరో యువహీరో వచ్చి హాజరైతే సుహృద్భావ వాతావరణం కనబడుతోంది అని పేర్కొంటారు కొందరు పెద్దలు. కానీ మా బోటి జనాలకు ఏమనిపిస్తుందీ అంటే..., ఈ మరో హీరో మాత్రం ఆ దర్శకుని ప్రాపకం కోసం వచ్చినట్టు, తనకూ మున్ముందు మరో బ్లాక్ బస్టర్ మూవీ చేయకపోతాడా అనే ఆశతో వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేనంటారా...

17 March, 2012

ఆ బాకీ ను కూడా వదలడా సచ్చినోడు....


సచిన్... సరిగా ఎంజాయ్ చేయనట్టు, అంత ఫీల్ కానట్టు అనిపించింది ఈ వందో సెంచరీ పూర్తి చేసిన తరువాత అతని రియాక్షన్స్ గమనిస్తే. అలాగే..., అతని సుదీర్ఘ కెరీర్ వల్ల ఇక్కడ ఆనందం స్థానాన్ని అలసట అధిగమించినట్టుంది. అలాగే..., వందో సెంచరీ గూర్చి తన పై వత్తిడి పెంచ ప్రయత్నించిన మీడియా తదితరుల చెర నుండి విడుదలైన భావన కనపడింది. అదీగాక ఎంతైనా సచిన్ కూడా తనకు తాను కూడా ఒత్తిడి ని ఫీల్ అయినట్టున్నాడు ఈ వందో సెంచరీ గురించి. అందుకే అతనిలో ఆనందం కన్నా, ఓ పని పోయిందన్న భావన కనపడింది. సచిన్ ఎంజాయ్ చెయ్యని సెంచరీలు లిస్టు ఏమైనా ఉంటే, ప్రాధాన్యతా క్రమం లో మొదట ఉండే సెంచరీ ఈ వందో సెంచరీ. అలాగే సచిన్ కు ఇంకో బాకీ మిగిలి ఉంది, దానినీ వదలడు. అదేమంటే..., వన్డేలలో 50 వ సెంచరీ. ఒక్క అడుగు దూరం లో మాత్రమే ఉన్నాడీ రికార్డ్ కు. ఈ విషయం మరచి, అతని గురించి తెలిసీ, అతని రిటైర్మెంట్ గూర్చి మాట్లాడడం దండగేమో...
అలాగే ఈ వందో సెంచరీ పూర్తి అయాక, ప్రేక్షకులకు అభివాదం తెలిపాక, సచిన్ తన హెల్మెట్ పైకి ఎత్తి, తన బాట్ హేండిల్ తో హెల్మెట్ పైన ఉన్న BCCI సింబల్ ను అందరికీ చూపాడు. అపుడు ఈ వందో సెంచరీని BCCI కు అంకితమిస్తున్న భావన కనపడింది. తరువాత అలా ప్రకటిస్తాడని అనుకున్నా, కానీ అలా చేయలేదు. రిటర్మెంట్ నిర్ణయాన్ని తనకే వదలి, తన కెరీర్ కొనసాగింపుకు కారణమై, ఈ అరుదైన రికార్డ్ సాధనకు కారణమైన BCCI పై కృతజ్ఞాతాభావం తో అలా చూపి ఉండవచ్చు. అలాగే..., BCCI ఈ రోజు ఆర్ధికం గా పరిపుష్టమై ఉండడానికి కారణం ఏమంటే తన సుదీర్ఘ కెరీర్ తో ఈ దేశం లో క్రికెట్ పట్ల ఇసుమంతైనా క్రేజ్ తగ్గక పోవడానికి కారణమైన సచిన్ వల్ల కూడా. అలా, BCCI మరియు సచిన్ ఒకరికొకరు ఋణపడి ఉన్నారు.

11 March, 2012

జగన్ Vs అఖిలేష్ ...

ఒక ప్రభంజనం లా దూసుకువచ్చేవాడే పెద్ద నేత కాగలడు. ములాయం చేతికి అందివచ్చిన కొడుకు అఖిలేష్ సరైన సమయం లో కరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ జగన్, తన తండ్రి YSR బ్రతికి ఉన్న టైం లో ప్రజలలోకి చొచ్చుకుపోడానికి ప్రయత్నించలేదు. తన తండ్రి హయాం లో ప్రజలకు జగన్ పేరే గాని రూపు కూడా తెలియదు. కానీ తదనంతరం తన యొక్క ధనం తోనూ, సొంత మీడియా తోనూ తానో ప్రభంజనం అనే రూపు తెచ్చుకోడానికి ప్రయత్నించి, స్వయంకృతాలతో భంగపడ్డాడు.
అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిమిత్తం UP అంతా చుట్టి వచ్చాడు. పార్టీ వర్గాల్లో బేధాలు తొలగించి, ఐకమత్యం కోసం పాటుపడ్డాడు. ప్రజలకు నేనున్నానే భరోసా ఇచ్చాడు. కానీ జగన్..., ఓదార్పు పేరుతో యాత్రలు చేస్తున్నాడు. జగన్ మన ఊరు వచ్చాడా..., ఆ... మన కోసం రాలేదు..., ఎవడినో ఓదార్చడానికి వచ్చాడు... అని ప్రజలు అనుకునేలా యాత్రలు చేస్తున్నాడు.
అటు UP లో మాయావతి విగ్రహ ప్రతిష్ఠాపన కూడా మాయావతి కు మైనస్ అయింది. మరి ఇక్కడ YSR విగ్రహ ప్రతిష్ఠాపన అనేది జగన్ కార్యక్రమం. దీని ఫలితామెలా ఉండబోతుందో... మరి.
తన తండ్రి తో పోలిస్తే అఖిలేష్ ముఖకవళికలు ఆకర్షణీయంగా చిరునవ్వుతో ఉంటాడు. కానీ జగన్ సంగతి అలాకాదు. YSR మొఖం లో ఉండే చరిష్మా, చిరునవ్వు జగన్ మొఖం లో కొరవడ్డాయి. జగన్ నవ్వు చూస్తే అది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు అని తెలిసిపోతుంది.
అలాగే UP ఎన్నికల ఫలితాలు అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. కేంద్రం లో అధికారం లో ఉన్న UPA ప్రభుత్వం హయాం లో కుంభకోణాల ఫలితం గా కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారు అనుకుంటే..., కల్మాడి, రాజా, కనిమొళి, దయానిధి మారన్ ల లాగే వారి బాట లోనే సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ కూడా ఉన్నాడు. కాబట్టి జగన్ కు అనుకూలమైన అంశం కాదిది.

అలాగే..., UP ఫలితాలు ఉత్సాహం కలిగించేది ఎవరికంటే...., అది తెలుగుదేశం పార్టీ కే. జగన్ పార్టీ తిరిగి కాంగ్రెస్ లో విలీనమైనా కాకున్నా, కాంగ్రెస్ ఇమేజ్ కు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. గత ఎన్నికలలో PRP వల్ల చీలిన వోట్ల తో,  కొద్దిపాటి తేడాతో అధికారం కు దూరమైన TDP, ఈ సారి 2014 ఎన్నికలలో అదే కొద్ది పాటి తేడాతో అధికారం దక్కించుకుని, ఇదివరకు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు అనుభవమున్న చంద్రబాబు మరల కేంద్రం ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది.

10 March, 2012

తిరుమల లో నా ప్రాక్టికల్ జోక్...

మొన్ననే నాలుగు రోజుల క్రితం తిరుమల వెళ్లి వచ్చాను. ప్రయాణం, దర్శనం అంతా బాగానే జరిగింది. ఈ సందర్భం గా ఐదేళ్ళ క్రితం మా శ్రీమతి మరియు మా పాప తో నేను తిరుమల వెళ్ళినపుడు నేను చేసిన ఒక ప్రాక్టికల్ జోక్ ఒకటి గుర్తు వచ్చింది. అదేమిటంటే..., తిరుమల లో గుబ్బా చౌల్ట్రీ పక్కన TTD వారి మ్యూజియం ఉంది. దాంట్లో పురాతన, చారిత్రక మరియు రాయల కాలం నాటి కొన్నివస్తు సముదాయం మరియు శ్రీవారి కి సంబంధించిన శిల్ప సంపద, విశేషాలు ఇలా చాలా ఉంటాయి. సరే..., మా పాపకు అవి చూపుదామని, మేము కూడా మ్యూజియం కు వెళ్ళాము. అంతకు మునుపు ఒకసారి నేను ఆ మ్యూజియం చూసి ఉండడం వల్ల కొంచెం బోర్ కొడుతోంది నాకు..., అలా చూస్తూ వెళ్తుంటే. మాకు కొద్దిగా ముందు, సందర్శన కు వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వారు కొంత సందడి చేస్తూ మ్యూజియం అంతా కలియతిరుగుతున్నారు. వారిని చూసాక నాకు ఎందుకో చిన్న ప్రాక్టికల్ జోక్ చేయాలనిపించి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ లోగా నాకు అక్కడ ఆ వస్తు సముదాయం లో ఏదో రాజుల కాలం నాటి ఒక అద్దం కనపడింది. అది ఒక Stand Mirror. అంతే..., ఇహ నేను..., అక్కడ నుంచుని నా తల దువ్వుకోవడం మొదలెట్టా. అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్న నా శ్రీమతి నేను రాకపోవడం గమనించి "ఏమిటండీ..., అక్కడేమి చేస్తున్నారు...?" అని అడిగింది. నా శ్రీమతి కొంచెం దూరంలో ఉండడంతో, నేను కొంచెం గట్టిగా ఆ కాలేజ్ స్టూడెంట్స్ కు కూడా వినబడేలా "ఇది శ్రీ కృష్ణ దేవరాయలు తల దువ్వుకొన్న అద్దం..., శ్రీ కృష్ణ దేవరాయలు తల దువ్వుకొన్న అద్దం లో నేను కూడా చూసుకుంటూ తల దువ్వుకుంటున్నా..." అని చెప్పా. వెంటనే నా శ్రీమతి, మా పాప గబగబా వెనక్కి వచ్చి వారు కూడా ఆ అద్దం లో చూసుకుంటూ తల సవరించుకున్నారు. ఇదంతా ఆ కాలేజ్ స్టూడెంట్స్ గమనించారు. అయితే మేము ఆ రాక్ లో ఉన్నంత సేపు వారిలో స్పందన లేదు. కానీ..., మేమా రాక్ ను విడచి వెళ్తూ, ఒకసారి నేను ఆ రాక్ లోకి వెనక్కి తిరిగి తొంగి చూసా, అక్కడ నాకు కనబడిన దృశ్యాన్ని ముందుకు వెళ్తున్న నా శ్రీమతిని పిలిచి చూపించా. ఇంతకీ ఆ దృశ్యమేమంటే..., ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ ఆ అద్దం లో తమ తల సవరించుకుంటున్నారు. ఇంతలో వారు వెనకనున్న నన్ను గమనించి పకపకా నవ్వేసారు. నిజానికి అంతకుముందే వారా అద్దాన్ని మాకన్నా ముందే దాటి వెళ్ళారు. ఇదండీ..., తిరుమలలో నా ప్రాక్టికల్ జోక్.
Related Posts Plugin for WordPress, Blogger...